అదరగొట్టిన జీ మీడియా.. తొలి వీకెండ్ లోనే ఫిఫా వరల్డ్ కప్ కు 100 మిలియన్ల వ్యూస్
Actor ProfilePolitician

అదరగొట్టిన జీ మీడియా.. తొలి వీకెండ్ లోనే ఫిఫా వరల్డ్ కప్ కు 100 మిలియన్ల వ్యూస్

Total News1
Movie Updates0
Sources1
అదరగొట్టిన జీ మీడియా.. తొలి వీకెండ్ లోనే ఫిఫా వరల్డ్ కప్ కు 100 మిలియన్ల వ్యూస్
Zee Telugu15 Jun 2026
అదరగొట్టిన జీ మీడియా.. తొలి వీకెండ్ లోనే ఫిఫా వరల్డ్ కప్ కు 100 మిలియన్ల వ్యూస్

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. FIFA World Cup 2026: ప్రపంచవ్యాప్త క్రీడా సంబరం ఫుట్‌బాల్‌ యావత్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తుండగా.. భారతదేశంలో కూడా జీ మీడియా ద్వారా ప్రజలు ఫిఫా ప్రపంచకప్‌ను వీక్షిస్తూ వినోదం పొందుతున్నారు. ఫిఫా మెగా టోర్నీ ప్రసార హక్కులు జీ మీడియా దక్కించుకోవడంతో జీ నెట్‌వర్క్‌లోని వివిధ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఫిఫా వరల్డ్‌ కప్‌ను వీక్షిస్తున్నారు. వీక్షణల్లో జీ మీడియా కొత్త రికార్డులు నమోదు చేసింది. తొలి వారాంతంలోనే వంద మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఫిఫా ప్రపంచకప్‌ 2026 మ్యాచ్‌లను జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ ద్వారా భారతీయ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఫుట్‌బాల్ అభిమానులను అలరిస్తూ ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రసారాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచకప్‌ ప్రారంభమైన తొలి వీకెండ్‌లోనే డిజిటల్, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఏకంగా 10 కోట్ల (100 మిలియన్) మందికి పైగా వీక్షకులను ఆకట్టుకుంది. వంద మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డు నమోదు చేసింది. జీ గ్రూప్‌నకు చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'జీ5' తొలి వీకెండ్‌లోనే సుమారు 60 లక్షల (6 మిలియన్) మంది వీక్షించారు. ఆరంభ వేడుకలతో పాటు జూన్ 11 నుంచి జూన్ 14 వరకు (4 రోజుల పాటు) జరిగిన లైవ్ మ్యాచ్‌లు చూసేందుకు వీక్షకులు ఎగబడ్డారు. ఒక్కో వీక్షకుడు సగటున 190 నిమిషాల పాటు మ్యాచ్‌లను వీక్షించడంతో జీ5 యాప్‌ సత్తా ఏమిటో తెలుపుతోంది. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఫిఫా కంటెంట్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. జీ మీడియా సోషల్ మీడియా వ్యాప్తంగా ఏకంగా