అదిరిపోయే అప్ గ్రేడ్ తో హీరో ప్యాషన్ ప్లస్ బైక్
Actor ProfileActor

అదిరిపోయే అప్ గ్రేడ్ తో హీరో ప్యాషన్ ప్లస్ బైక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అదిరిపోయే అప్ గ్రేడ్ తో హీరో ప్యాషన్ ప్లస్ బైక్
AP7AM2 Aug 2026
అదిరిపోయే అప్ గ్రేడ్ తో హీరో ప్యాషన్ ప్లస్ బైక్

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, దేశీయ మార్కెట్లో తన ప్రాచుర్యం పొందిన ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ ప్యాషన్ ప్లస్‌లో సరికొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. 'ప్యాషన్ ప్లస్ డిస్క్' పేరుతో వచ్చిన ఈ కొత్త మోడల్‌ను భద్రత, ఆధునిక ఫీచర్లను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చారు. దీని ఎక్స్-షోరూమ్ ధరను (ఢిల్లీ) రూ. 84,128గా కంపెనీ నిర్ణయించింది.ప్రధాన ఆకర్షణ.. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ఈ కొత్త వేరియంట్‌లో అత్యంత ముఖ్యమైన మార్పు ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ను అమర్చడం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డ్రమ్ బ్రేక్ వెర్షన్‌తో పోలిస్తే, డిస్క్ బ్రేక్ మెరుగైన బ్రేకింగ్ పనితీరును, నియంత్రణను అందిస్తుంది. ముఖ్యంగా నగరాల్లోని రద్దీ ట్రాఫిక్‌లో ఆకస్మికంగా బ్రేకులు వేయాల్సి వచ్చినప్పుడు ఇది రైడర్ భద్రతను గణనీయంగా పెంచుతుంది. ఈ అప్‌గ్రేడ్‌తో కమ్యూటర్ విభాగంలో భద్రతకు హీరో ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.ఆధునిక ఫీచర్లు, ఇంజిన్ పనితీరుఈ బైక్‌లో కేవలం బ్రేకింగ్ వ్యవస్థను మాత్రమే కాకుండా, పలు ఆధునిక ఫీచర్లను కూడా జోడించారు. రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో-ఫ్యూయల్ వార్నింగ్, సర్వీస్ రిమైండర్‌లతో పాటు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. దీని ద్వారా రైడర్లు తమ స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే కాల్/SMS అలర్ట్‌లను నేరుగా క్లస్టర్‌పై చూడవచ్చు. దీంతోపాటు ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ సెన్సార్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, యుటిలిటీ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ వంటివి కూడా ఉన్నాయి.ఇంజిన్ విషయంలో హీరో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో అదే