అది నేను కాదు.. ఇన్ స్టాలో ఫేక్ అకౌంట్
Actor ProfileActor

అది నేను కాదు.. ఇన్ స్టాలో ఫేక్ అకౌంట్

Total News1
Movie Updates0
Sources1
అది నేను కాదు.. ఇన్ స్టాలో ఫేక్ అకౌంట్ పై స్పందించిన నటి
Eenadu13 Jun 2026
అది నేను కాదు.. ఇన్ స్టాలో ఫేక్ అకౌంట్ పై స్పందించిన నటి

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘లక్కీ భాస్కర్‌’ బ్లాక్‌బస్టర్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary). ఇటీవల తన పేరు, ఫొటో, నంబర్‌తో వైరల్‌ అవుతున్న ఒక ఫేక్‌ అకౌంట్‌పై ఆమె స్పందించారు. తన ఫొటో, ఫేక్‌ నంబర్‌తో మోసం చేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని అభిమానులను అప్రమత్తం చేశారు. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్టోరీ పెట్టారు. ‘ఈ నంబర్ నుంచి మీకు కాల్ వస్తే రిపోర్ట్ చేయండి. ఇది నేను కాదు. ఈ సమాచారాన్ని అందించిన వారికి ధన్యవాదాలు’’ అని ఆమె చెప్పారు. ప్రస్తుతానికి అనేక ప్రాజెక్టుల్లో మీనాక్షి బిజీగా ఉన్నారు. నాగచైతన్య కథానాయకుడిగా, కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ‘వృషకర్మ’లో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. అభిమానులు, సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలను రేకెత్తించిన ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తిరువీర్, ఐశ్వర్య రాజేశ్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ..! సుకుమారి’. భరత్‌దర్శన్‌ దర్శకుడు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది