అదే టీమిండియా కొంపముంచింది'.. ప్లేయర్ల
Actor ProfileActor

అదే టీమిండియా కొంపముంచింది'.. ప్లేయర్ల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అదే టీమిండియా కొంపముంచింది'.. ప్లేయర్లపై గవాస్కర్ ఫైర్
Sakshi16 Aug 2026
అదే టీమిండియా కొంపముంచింది'.. ప్లేయర్లపై గవాస్కర్ ఫైర్

టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ త‌న ప్రస్థానాన్ని ఓటమితో ఆరంభించాడు. అత‌డి సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు ఐర్లాండ్‌తో జ‌రిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 తేడాతో క్లీన్ స్వీప్ అయింది. ఈ సిరీస్‌కు ముందు ఐర్లాండ్‌పై భారత్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోయిన రికార్డు లేదు. కానీ ఇప్పుడు వరుసగా మ్యాచ్‌ల‌లోనూ ఓడిపోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ చరిత్రలోనే ఇదొక మాయని మచ్చ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్ల నిర్లక్ష్య వైఖరిపై కూడా గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌లో ఒకరిద్దరూ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. 155 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కూడా టీమిండియా ఛేదించ‌లేక చ‌తిక‌ల‌ప‌డడం గ‌మ‌నార్హం. "జూన్ 28(ఆదివారం) అనేది భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లోనే అత్యంత దారుణమైన రోజుగా నిలిచిపోతుంది. మ్యాచ్‌లో ఓడిపోవడం, సిరీస్‌ను కోల్పోవ‌డం స‌హ‌జం. కానీ ఏ జ‌ట్టు చేతిలో ఓడిపోయామ‌నేది ముఖ్యం. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి, వాటిలో కొన్నింటిలో నేను కూడా భాగమయ్యాను. అయితే ఐర్లాండ్ వంటి చిన్న జ‌ట్టు చేతిలో ఓడిపోవ‌డం మాత్రం ఇండియన్ క్రికెట్ హిస్ట‌రీలోనే ఘెర ప‌రాభావంగా చెప్పుకోవాలి. ఒకవేళ ఐర్లాండ్ అద్భుత‌మైన క్రికెట్ ఆడి గెలిస్తే ఆ బాధ ఇంతగా ఉండేది కాదు. కానీ భారత ఆటగాళ్లలో కనిపించిన మితిమీరిన ఆత్మవిశ్వాసం, నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ఓటమి ఎదురైంది. అదే నన్ను ఎక్కువగా బాధించింది. ఈ ఓట‌మి 1983 ప్రపంచ కప్ ఫైనల్‌లో వెస్టిండీస్ ప్రదర్శనను గుర్తు చేసింది. ఆ స‌మ‌యంలో భారత బౌలర్లు తెలివిగా, కచ్చితమైన లైన్ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్ చేశారు. మ్యాచ్‌ను ఈజీగా ముగించేలా కనిపించిన వివ్ రిచర్డ్స్‌ను అవుట్ చేస్తూ కెప్టెన్ కపిల్ దేవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేసింది. అప్పుడు