అథిరడి' సోనీ లివ్ మూవీ రివ్యూ
Actor ProfileActor

అథిరడి' సోనీ లివ్ మూవీ రివ్యూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అథిరడి' సోనీ లివ్ మూవీ రివ్యూ
AP7AM20 Jun 2026
అథిరడి' సోనీ లివ్ మూవీ రివ్యూ

'అథిరడి' ఓ మలయాళ సినిమా. బాసిల్ జోసెఫ్ .. టోవినో థామస్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, అరుణ్ అనిరుద్ధన్ దర్శకత్వం వహించాడు. మే 14వ తేదీన థియేటర్లలో విడుదలైన సినిమా ఇది. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, 70 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఐదు భాషల్లో అందుబాటులో ఉంది. సామ్ కుట్టి (బాసిల్ జోసెఫ్) ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవుతాడు. ప్రశాంత్ తో కలుపుకుని తన కంటూ ఒక గ్యాంగ్ ను రెడీ చేసుకుంటాడు. గతంలో సామ్ కుట్టి అన్నయ్య 'జోసెఫ్' (సుకుమార్) కూడా అదే కాలేజ్ లో చదువుతాడు. ఆ సమయంలో 'ఆరోహణ్' అనే పేరుతో ప్రతి ఏడాది ఒక ఫెస్ట్ ను నిర్వహిస్తూ వస్తారు.ఒకసారి నిర్వహించిన ఫెస్ట్ లో తొక్కిసలాట జరగడంతో ముగ్గురు స్టూడెంట్స్ చనిపోతారు. అందుకు కారకుడు జోసెఫ్ అనే ముద్ర పడిపోతుంది. కాలేజ్ లో ఆ ఏడాది నుంచి ఆ ఫెస్ట్ ను నిషేదిస్తారు. తన గురించి ఆ కాలేజ్ లో ఒక చేదు అభిప్రాయం ఉండిపోవడం జోసెఫ్ ను మానసికంగా కుంగదీస్తుంది. ఆ కాలేజ్ లో ఆ ఫెస్ట్ ను మళ్లీ జరిపించి, తన అన్నయ్యతో పాటు అప్పటి బ్యాచ్ ను ఆహ్వానించాలనే ఒక బలమైన అభిప్రాయంతో సామ్ కుట్టి ఉంటాడు. అందుకు సంబంధించిన అతని ప్రయత్నాలను, స్వాతి ఆర్ కృష్ణ (రియా శిబూ) సపోర్ట్ చేస్తుంటుంది. కాలేజ్ లో నిర్వహించే ఫెస్ట్ లో పాడటానికిగాను, సింగర్ 'వినీత్ శ్రీనివాసన్' ను సామ్ కుట్టి ఒప్పిస్తాడు. అయితే ఆ సమయంలోనే స్ట్రీట్ సింగర్ అయిన కుట్టన్ (టోవినో థామస్)తో సామ్ కుట్టీ మిత్ర బృందం గొడవ పడుతుంది. వాళ్ల కారణంగా కుట్టన్