అతన్ని కొట్టాను..ఇప్పటికీ బాధపడుతున్నా
Actor ProfileActor

అతన్ని కొట్టాను..ఇప్పటికీ బాధపడుతున్నా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అతన్ని కొట్టాను..ఇప్పటికీ బాధపడుతున్నా
Sakshi27 Jul 2026
అతన్ని కొట్టాను..ఇప్పటికీ బాధపడుతున్నా

సినిమాల్లో ఒకప్పుడు యాక్షన్‌ సన్నివేశాలు కేవలం హీరోలు మాత్రమే చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. హీరోయిన్లు సైతం గాల్లోకి ఎగిరి ఫైట్‌ చేస్తున్నారు. రెండు చేతుల్లో గాన్స్‌ పట్టి ఫైర్‌ కూడా చేస్తున్నారు. అలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే అందాల భామ అలియా భట్‌ కూడా హై-వోల్టేజ్ యాక్షన్‌ థ్రిల్లర్‌తో అలరించడానికి రెడీ అవుతుంది. ఆమె ప్రధాన పాత్రలో, శివ్‌ రావేల్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆల్ఫా’. జులై 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా.. ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఈ సినిమాలోని యాక్షన్‌ సీన్ల కోసం ప్రాక్టీస్‌ చేస్తున్న సయమంలో ఓ కొరియోగ్రాఫర్‌ని కొట్టానని చెప్పింది. అలా కొట్టినందుకు ఇప్పటికీ బాధ పడుతున్నానని అలియా తెలిపింది. ‘ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో అనుకోకుండా అతన్ని కొట్టాను. వెంటనే సారీ కూడా చెప్పాను. కానీ నా వల్ల ఒకరికి దెబ్బ తగిలినందుకు చాలా బాధేసింది. ఇప్పటికీ అది గుర్తొచ్చినప్పుడల్లా బాధపడతాను. యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరపై సహజంగా చూపించడానికే అలా ప్రాక్టీస్‌ చేశాం. ఆల్ఫాలో యాక్షన్‌ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఈ చిత్రం ఇచ్చింది’ అని అలియా చెప్పకొచ్చింది. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన బాబీ డియోల్‌ కూడా అలియా యాక్షన్‌ సీన్స్‌ చూసి భయపడిపోయానని చెప్పాడు. అలియా చాలా సన్నగా ఉంటారని.. ఎక్కడ దెబ్బ తగులుతుందోననే భయంతో జాగ్రత్తగా షూటింగ్‌ చేశామని ఆయన చెప్పుకొచ్చాడు. థాయ్‌ల్యాండ్ బీచ్ వెకేషన్‌లో సినిమా జంట (ఫొటోలు) సూపర్‌స్టార్ మూవీ లాంచ్ కోసం రాశీఖన్నా ఇలా (ఫొటోలు) కేన్స్‌లో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా సందడి.. ఫోటోలు సీఎం హోదా పక్కనపెట్టి.. విజయ్‌ మరో సర్‌ప్రైజ్‌! (ఫొటోలు) ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి లేటేస్ట్ గ్లామరస్ లుక్స్.. ఫోటోలు ఇది పక్కా ప్లాన్ మర్డర్