అడగగానే ఇవ్వొద్దు.. ఆలోచించనిద్దాం
Actor ProfileCelebrity

అడగగానే ఇవ్వొద్దు.. ఆలోచించనిద్దాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అడగగానే ఇవ్వొద్దు.. ఆలోచించనిద్దాం
Sakshi1 Sept 2026
అడగగానే ఇవ్వొద్దు.. ఆలోచించనిద్దాం

పుణేలో కోట అంచున నిలబడ్డ ప్రేమ ఒక్కతోపుతో హత్యగా మారింది. బెంగళూరులో నట్టనడి ఇంట్లో నిలుచున్న ప్రేమ నెత్తురు పారించింది. ఈ రెండు ఘటనలూ ‘ఇప్పుడే కావాలి’ అనే ఆవేశానివే. ‘ఇవ్వాళ ఆలోచించి రేపు మాట్లాడాలి’ అనే సంస్కారం పోయి ‘ఇప్పుడే తేల్చేయాలి’ అనే తెంపరితనం ఇది. దీని పేరు – ఇన్‌ స్టంట్‌ గ్రాటిఫికేషన్‌. అంటే ‘తక్షణ సంతృప్తి’ అనే మానసిక జ్వరం. బిర్యానీ నుంచి బంధాల వరకు, ప్రోటీన్‌ షేక్‌ నుంచి ప్రతీకారం వరకు– అంతా ‘క్విక్‌ డెలివరీ’ కావాల్సిందే. వేచి చూడలేని మనసు వేటు వేయడానికి వెనుకాడడం లేదు. ఓపిక నేర్పని ఫోన్‌ లు... ఓదార్పు మరచిన జెన్‌ జెడ్‌. మెదడులో ‘పాజ్‌’ బటన్‌ చెడిపోతే జీవితం ‘ఫాస్ట్‌ఫార్వర్డ్‌’లో నేరం వైపు పరుగెడుతుంది. ఇది ట్రెండ్‌ కాదు, టైం బాంబ్‌. ఆపకపోతే ప్రతి ఇల్లు ఒక క్రైమ్‌ సీన్‌ అవుతుంది. ‘ఇప్పుడే వద్దు, కాస్త ఆగి ఆలోచించండి’... ఈ ఒక్క మాటే ఇవాళ మీ పిల్లలకు మీరు ఇవ్వాల్సిన ఆస్తి. ‘ఈరోజే... ఇప్పుడే’ ‘ధనా ధన్‌ ఫటా ఫట్‌’ ధోరణి అనేది సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ ప్రతిపాదించిన ఆనంద సూత్రం(ప్లెజర్‌ ప్రిన్సిపుల్‌). ఇదిప్రాథమిక అవసరాలను తక్షణమే తీర్చుకోవడానికి, బాధను తప్పించుకోవడానికి ప్రేరేపించే ఒక సహజ ప్రవృత్తి... ప్లెజర్‌ ప్రిన్సిపుల్‌. ఫ్రాయిడ్‌ ప్రతిపాదించిన ఈ సూత్రం మానవ మనస్తత్వంలోప్రాథమిక నియంత్రణ శక్తిగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక మానసిక సమస్య ‘ఇప్పటి ఈ ఇన్‌స్టంట్‌ గ్రాటిఫికేషన్‌ వల్ల దీర్ఘకాలికంగా కొన్ని మానసిక సమస్యలకు రావచ్చు. తాము కోరుకున్నది తక్షణమే నెరవేరాలని ఆశించేలా చేస్తుంది... ఇన్‌స్టంట్‌ గ్రాటిఫికేషన్‌. దీనివల్ల వేచి ఉండడం, ఓపికగా ఉండే గుణం తగ్గిపోతుంది. నిరంతర తృప్తి తొందరపాటును సృష్టిస్తుంది. తట్టుకునే శక్తిని తగ్గిస్తుంది. ఎదురుదెబ్బలు తట్టుకోలేమనే భావన కలిగిస్తుంది’ అని హెచ్చరిస్తున్నారు కోల్‌కతాలోని సీఎంఆర్‌ఐ ఆసుపత్రి సైకియాట్రిస్ట్‌ డా.అంబరీష్‌ ఘోష్‌. ఇన్‌స్టంట్‌ గ్రాటిఫికేషన్‌ కారణంగా జెన్‌ జెడ్‌ వినియోగ విధానాలలో, వ్యక్తిత్వంలో తేడా