
పన్ను చెల్లింపుదారులకు కీలక గడువు సమీపించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి (FY 2026-27) సంబంధించిన తొలి అడ్వాన్స్ ట్యాక్స్ (ముందస్తు పన్ను) వాయిదాను (advance tax deadline 2026) జూన్ 15లోగా చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తోంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 ప్రకారం తొలి అడ్వాన్స్ ట్యాక్స్ వాయిదా ఇదే. అడ్వాన్స్ ట్యాక్స్ విధానం ద్వారా ప్రభుత్వం "సంపాదించిన కొద్దీ పన్ను చెల్లింపు" (Pay-as-you-earn) వ్యవస్థను అమలు చేస్తోంది. ఏడాది చివర్లో ఒకేసారి పన్ను చెల్లించకుండా, అంచనా పన్నును నాలుగు విడతల్లో చెల్లించే అవకాశం ఉంటుంది. టీడీఎస్ (TDS), టీసీఎస్ (TCS) మినహాయింపుల తర్వాత కూడా వార్షిక పన్ను బాధ్యత రూ.10,000 దాటితే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కింది వర్గాలకు వర్తిస్తుంది: 🔹 జీతభత్యాలు పొందే ఉద్యోగులు 🔹 ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు 🔹 స్వయం ఉపాధి నిపుణులు 🔹 వ్యాపారులు 🔹 అద్దె ఆదాయం పొందేవారు 🔹 వడ్డీ ఆదాయం లేదా పెట్టుబడి లాభాలు పొందేవారు అంటే జీతం నుంచి టీడీఎస్ కట్ అవుతున్నప్పటికీ, అదనంగా అద్దె, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, షేర్లు లేదా ఇతర పెట్టుబడుల ద్వారా ఆదాయం వస్తే అడ్వాన్స్ ట్యాక్స్ బాధ్యత ఏర్పడే అవకాశం ఉంది. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వ్యాపార ఆదాయం ఉంటే ఈ మినహాయింపు వర్తించదు. సాధారణ పన్ను చెల్లింపుదారులు తమ అంచనా వార్షిక పన్ను బాధ్యతలో కనీసం 15 శాతం మొత్తాన్ని జూన్ 15లోగా చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల షెడ్యూల్ ఇలా ఉంటుంది: 🔹జూన్ 15: మొత్తం పన్నులో 15% 🔹సెప్టెంబర్ 15: మొత్తం పన్నులో 45% 🔹డిసెంబర్