అడుగుల ఎత్తులో ప్రపోజల్.. ఇంతలో ఊహించని ట్విస్ట్
Actor ProfilePolitician

అడుగుల ఎత్తులో ప్రపోజల్.. ఇంతలో ఊహించని ట్విస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అడుగుల ఎత్తులో ప్రపోజల్.. ఇంతలో ఊహించని ట్విస్ట్
Sakshi30 Aug 2026
అడుగుల ఎత్తులో ప్రపోజల్.. ఇంతలో ఊహించని ట్విస్ట్

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అత్యంత ఎత్తైన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ (1,454 అడుగులు) పైభాగాన ఉన్న ట్రాన్స్‌మిషన్ టవర్‌ను ఎక్కిన ఒక జంట అక్కడ ఒక శాంతి సందేశం బ్యానర్‌ను ప్రదర్శించి సంచలనం సృష్టించింది. నలుపు రంగు దుస్తులు ధరించిన ఈ జంట టవర్ పైకి చేరి, ‘అధికారంపై ప్రేమ అజమాయిషీ చేసినప్పుడు ప్రపంచంలో శాంతి వర్ధిల్లుతుంది’ అని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించింది. ఈ సాహసం తర్వాత వారు టవర్ కింద ఉన్న ఒక ప్లాట్‌ఫారమ్‌కు చేరుకున్నాక, సదరు వ్యక్తి ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చుని తనతో ఉన్న మహిళకు పెళ్లి ప్రతిపాదన చేశాడు. దానిని ఆమె అంగీకరిస్తూ తన ముఖానికి ఉన్న ముసుగును తొలగించి, అతడిని ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకుంది. ఈ దృశ్యాలను చూసిన అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ హెలికాప్టర్ వెంటనే రంగంలోకి దిగింది. మధ్యాహ్నం 12:35 గంటల సమయంలో ఆ జంట కిందకు దిగుతుండగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను న్యూజెర్సీకి చెందిన ఇవాన్ కుజ్నెత్సోవ్ (32), ఏంజెలీనా నికోలావ్ (33)గా గుర్తించారు. వీరు గతంలో కూడా ఇలాంటి సాహసాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన కారణంగా భవనంలో ఉన్న సందర్శకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ప్రతినిధి తెలిపారు. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడి.. ‘కీవ్‌’ అతలాకుతలం హైదరాబాద్ : బేగంపేట కంట్రీక్లబ్‌లో అందాల తునకలు (ఫొటోలు) డైరెక్టర్ మెహర్ రమేశ్ కూతురి రిసెప్షన్‌.. టాలీవుడ్ తారల సందడి (ఫొటోలు) ‘నాగబంధం’ మూవీ ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు) ఏపీ : శిల్ప కళా వైభవం.. చెక్కుచెదరని కట్టడం ఎక్కడో తెలుసా? (ఫొటోలు) క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ అలర్ట్.. వాట్సాప్ కొత్త ఫీచర్ పై కేంద్రం అప్రమత్తం టైమ్ మీది కొట్టారు.. టైమ్ మాకు వస్తది