అజిత్ సినిమాకు నిర్మాత లు లేరా
Actor ProfileActor

అజిత్ సినిమాకు నిర్మాత లు లేరా

Total News1
Movie Updates0
Sources1
అజిత్ సినిమాకు నిర్మాత లు లేరా
Telugu Times13 Jun 2026
అజిత్ సినిమాకు నిర్మాత లు లేరా

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) తదుపరి సినిమా విషయంలో ఆసక్తికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు నిర్మాతలు భారీ అడ్వాన్స్‌లతో ఆయన కాల్షీట్ల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండగా, ప్రస్తుతం మార్కెట్ సమీకరణాలు మారిపోవడంతో కొత్త ప్రాజెక్టుల అనౌన్స్‌మెంట్ ఆలస్యమవుతోంది. ముఖ్యంగా థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ వాల్యూస్ లో వచ్చిన మార్పులు హీరోల రెమ్యునరేషన్‌లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ కొత్త సినిమా కోసం పలువురు ప్రముఖ నిర్మాణ సంస్థలు చర్చలు జరిపినా, ఆర్థిక అంశాల దగ్గరే చర్చలు నిలిచిపోయినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల అజిత్‌కు భారీ విజయాన్ని అందించిన డైరెక్ట‌ర్ అధిక్ ర‌విచంద్ర‌న్(Aadhik Ravichandran)తో మరోసారి కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌కు సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని సమాచారం. అయితే ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు ముందుకొచ్చిన కొందరు నిర్మాతలు బడ్జెట్ లెక్కలు పరిశీలించిన తర్వాత వెనక్కి తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబ‌ళే ఫిల్మ్స్(Hombale Films) కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపినట్లు పరిశ్రమలో చర్చ నడుస్తోంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. దాంతో పాటూ అజిత్ మరోసారి డైరెక్ట‌ర్ సిరుత్తై శివ‌(Siruthai Siva)తో సినిమా చేయడానికి కూడా సానుకూలంగా ఉన్నారని సమాచారం. రెండు కథలు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించే నిర్మాత ఖరారు కావడం కీలకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ హీరోల రెమ్యూన‌రేష‌న్‌ల‌పై నిర్మాతలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుండటంతో, అజిత్ తదుపరి సినిమా ఎవరితో, ఏ బ్యానర్‌లో రూపొందుతుందన్నది కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సరైన ఆర్థిక సమీకరణాలు కుదిరితే త్వరలోనే ఆయన కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి