అజ్ఞాతవాసి తర్వాత 2 కోసమే పవన్ అలా
Actor ProfileActor

అజ్ఞాతవాసి తర్వాత 2 కోసమే పవన్ అలా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అజ్ఞాతవాసి తర్వాత 2 కోసమే పవన్ అలా
TV9 Telugu3 Aug 2026
అజ్ఞాతవాసి తర్వాత 2 కోసమే పవన్ అలా

OG 2 ఎలా ఉండబోతుంది..? ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్‌ను సుజీత్ ఎలా మార్చబోతున్నారు..? సీక్వెల్‌లో ప్రీక్వెల్ కథ చెప్తున్నారా లేదంటే ఓజి బ్యాక్ స్టోరీ ఏదైనా ఉందా..? అసలు ఈ చిత్రం కోసం పవన్ డేట్స్ ఎన్నాళ్లు ఇవ్వబోతున్నారు..? ఒకవేళ సుజీత్ ఇక్కడ స్టక్ అయిపోతే.. నాని బ్లడీ రోమియో పరిస్థితేంటి..? ఓజి 2 కోసం సుజీత్‌కు పవన్ పెట్టిన కండీషన్స్ ఏంటి..? ది మోస్ట్ అవైటెడ్ ఓజి 2 సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వీడియో వచ్చేసింది. కొన్ని రోజులుగా రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా.. రెగ్యులర్‌గా సుజీత్‌తో టచ్‌లోనే ఉన్నారు పవన్. అనుకున్నట్లుగానే ఈ సినిమాను ప్రకటించేసారు. ఓజి 2ను పవన్ కళ్యాణ్ సోలోగా నిర్మించబోతున్నారు. షూట్ కూడా మొదలవ్వకుండానే ఓజి 2కి భారీ ఓటిటి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఓజి సినిమా కోసం సుజీత్ పడిన తపన.. తనకు ఇచ్చిన ఫ్రీడమ్ పవన్‌కు బాగా నచ్చేసింది. అందుకే ఈ క్రేజీ సీక్వెల్ కోసం ఓజి కంటే సుజీత్‌కు డబుల్ రెమ్యునరేషన్ పవన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఓజి 2కు ఎవరూ ఊహించని విధంగా 70 రోజులు ఇవ్వనున్నారు పవన్. 2018 తర్వాత ఏ సినిమాకు 50 రోజులకు మించి ఇవ్వని పవన్.. ఓజి 2కి 70 రోజులు ఇస్తుండటం సంచలనమే. అజ్ఞాతవాసి కోసం అప్పట్లో 55 రోజుల వరకు డేట్స్ ఇచ్చారు పవన్.. ఆ తర్వాత ఆయన సినిమాలన్నీ 30 నుంచి 40 రోజుల్లోపే పూర్తయ్యాయి. బ్రో సినిమా అయితే కేవలం 21 రోజుల్లోనే పవన్ పార్ట్ పూర్తి చేసారు సముద్రఖని. అలాగే ఓజి సినిమాకు పవన్ ఇచ్చింది 37 రోజులే. కానీ ఓజి 2 కాన్సెప్ట్ నచ్చి 70 రోజులు ఇస్తున్నారు పవన్. వేరే సినిమాలు చేసినా.. తను పిలిచినపుడు అందుబాటులో ఉండాలనేది సుజీత్‌కు పవన్ పెట్టిన కండీషన్. ఈ లెక్కన నానితో బ్లడీ