అఖిలేశ్ కూతురి
Actor ProfilePolitician

అఖిలేశ్ కూతురి

Total News1
Movie Updates0
Sources1
అఖిలేశ్ కూతురిపై ట్రోలింగ్ .. సీఎం యోగి సీరియస్
Eenadu14 Jun 2026
అఖిలేశ్ కూతురిపై ట్రోలింగ్ .. సీఎం యోగి సీరియస్

ఇంటర్నెట్‌ డెస్క్: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కుమార్తెపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (yogi Adityanath) ఖండించారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. నేతల కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకురావొద్దని హితవు పలికారు. అఖిలేష్‌ యాదవ్‌ కుమార్తెపై అసభ్యకరమైన కామెంట్స్‌తో మార్ఫింగ్‌ చేసిన చిత్రాలను కొందరు దుండగులు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా యోగి ఆదిత్యనాథ్‌ దీనిపై స్పందించారు. ‘‘అఖిలేష్‌ యాదవ్‌ కుమార్తె లక్ష్యంగా కొందరు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఆ పోస్టులు నా దృష్టికి వచ్చాయి. నిందితులపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆడపిల్లలు అందరికీ సమానమే. వారిని గౌరవించాలి. ప్రతి ఇంట్లో కుమార్తె, సోదరి ఉంటారు. ఇతరులను కూడా అదే భావనతో చూడాలి. ఆయన కుమార్తె నాకు కుమార్తెతో సమానం. తేడా ఏమీ చూపించను. దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని సీఎం అన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. యమునా నది తీర ప్రాంతాల్లో దిల్లీ ప్రభుత్వం స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టింది