
Ira Aery : ప్రస్తుత రోజుల్లో మహిళా క్రికెట్‌కు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. ఆటతో పాటు తమ గ్లామర్‌తో స్టేడియంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచే ముద్దుగుమ్మలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటోంది. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఆస్ట్రేలియా జూనియర్ క్రికెట్ నుంచి ఒక అద్భుతమైన బ్యూటీ వచ్చి చేరింది. ఆస్ట్రేలియా అండర్-19 మహిళా జట్టుకు ఆడుతున్న భారత సంతతి టీనేజ్ క్రికెటర్ ఇరా ఏరీ తన అందం, అసాధారణమైన బౌలింగ్ నైపుణ్యంతో ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచంలో అత్యంత అందమైన సంచలనంగా అవతరించింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా వెస్ట్రన్ రీజియన్ జూనియర్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించిన ఇరా ఏరీ.. అంచలంచెలుగా ఎదుగుతూ జాతీయ జట్టులో చోటు సంపాదించింది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, తనలో అంతకు మించిన క్రికెట్ టాలెంట్ ఉందని ఈ మెగా టోర్నీలో నిరూపించింది. ఈ ట్రై సిరీస్ మొత్తం మీద ఇరా ఏరీ అత్యంత కన్సిస్టెన్సీతో బౌలింగ్ చేసి.. కేవలం 9 సగటుతో ఏకంగా 13 వికెట్లు పడగొట్టి టోర్నమెంట్‌లోనే జాయింట్ లీడింగ్ వికెట్ టేకర్‌గా అగ్రస్థానంలో నిలిచింది. ఈమె స్పెల్స్ చూసి అపోనెంట్ టీమ్స్ బ్యాటర్లు క్రీజులోకి రావడానికే భయపడ్డారు. ఆ టోర్నమెంట్‌లో ఇరా ఏరీ కెరీర్ బెస్ట్ ప్రదర్శన ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. ఇంగ్లండ్ బ్యాటర్లకు తన స్పిన్ మాయాజాలంతో చుక్కలు చూపిస్తూ.. 26 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా మ్యాచ్‌ను మలుపు తిప్పే ఒక అద్భుతమైన రన్-అవుట్ కూడా చేసి ఆస్ట్రేలియాకు ఒంటిచేత్తో విజయాన్ని అందించింది. ఈ ఆల్ రౌండ్ షోకు గాను ఈ మోస్ట్ బ్యూటీఫుల్ క్రికెటర్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ప్రెజెంటేషన్ సెరిమనీలో ఈమె అవార్డు తీసుకుంటున్న విజువల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక శ్రీలంక అండర్-19 జట్టుతో జరిగిన హోరాహోరీ