అందుకే విష ప్రచారం చేస్తున్నారు
Actor ProfilePolitician

అందుకే విష ప్రచారం చేస్తున్నారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అందుకే విష ప్రచారం చేస్తున్నారు
Sakshi4 Aug 2026
అందుకే విష ప్రచారం చేస్తున్నారు

సాక్షి, హైదరాబాద్‌: ‘‘సర్‌’ ప్రక్రియ ఓటర్ల జాబితాను పారదర్శకంగా మార్చే కీలక కార్యక్రమం అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా చాలాసార్లు జరిగిందని.. ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా నిర్వహించే సాధారణ చట్టబద్ధమైన ప్రక్రియగా కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘అర్హులైన వారికి ఓటు కల్పించాలి.. కానీ దీనిపై కూడా కొందరు రాజకీయం చేస్తున్నారు. ‘సర్‌’పై సుప్రీంకోర్టు కూడా దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కానీ కొన్ని రాజకీయ పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి. భారత పౌరుల విలువ పెంచే ప్రక్రియ ‘సర్‌’. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును భద్రపరచుకోవాలి.. స్వచ్ఛందంగా పాల్గొనాలి. బోగస్ ఓట్లు ఉండకూడదు. ‘‘సర్‌’ వచ్చాక ఓటు పర్సంటేజ్ పెరగడం అందరం చూశాం. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా బీహార్, బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఓటు శాతం పెరగడానికి కారణం ‘సర్‌’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. ‘‘ప్రజాస్వామ్యానికి భారత దేశం తల్లి లాంటిది.. మదర్ ఆఫ్ డెమోక్రసీ అని ప్రధాని మోదీ చెబుతుంటారు. ఎన్నికల కమిషన్ ఎవరి కనుసన్నల్లో పనిచేసే సంస్థ కాదు. కాంగ్రెస్ దీనిపై లేనిపోని అపోహలు సృష్టిస్తోంది. ఎన్నికల కమిషన్‌పై బురద చల్లాలని చూస్తున్నారు. ఆటం బాంబులు వేస్తా.. ప్రళయం సృష్టిస్తా అని చెప్పి వారి పరువు వారే తీసుకుంటున్నారు. ‘సర్‌’ వల్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు గుండెలు బాదుకుంటున్నాయి?. ఓటర్లను అవగాహన, చైతన్యం కల్పించాల్సిన పార్టీలు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాయి’’ అంటూ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు.. రేషన్ కార్డులు పొందారు. ఆధార్ కార్డులు పొందారు. లోన్లు కూడా తీసుకున్నారు. వీటిపై ఎందుకు ఈ పార్టీలు మాట్లాడటం లేదు. ‘సర్‌’ను మతంతో ముడిపెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సీఎం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని చాలా బస్తీల్లో రోహింగ్యాలు ఉన్నది వాస్తవం కాదా?. ఎవరు గుండెలు