అందుకే జగన్ అండ్ కో కుట్రలు
Actor ProfilePolitician

అందుకే జగన్ అండ్ కో కుట్రలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అందుకే జగన్ అండ్ కో కుట్రలు
Telugu Times13 Aug 2026
అందుకే జగన్ అండ్ కో కుట్రలు

మూడు రాజధానుల పేరుతో అమరావతిపై విషయం చిమ్మిన జగన్ (Jagan) అండ్ కో నేడు రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక పోతున్నారని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి (Veeranjaneya Swamy) ధ్వజమెత్తారు. అందుకే వైసీపీ రౌడీ మూకలు నిన్న రాజధానిలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నారన్నారు. ఆ పార్టీ కుట్రల్ని అమరావతి (Amaravati) రైతులు తిప్పికొట్టారని తెలిపారు. వైసీపీ ( YCP) హయాంలో అమరావతి రైతులపై అక్రమ కేసులు, వేధింపులతో హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఏ మొహం పెట్టుకుని వైసీపీ నేతలు రాజధానికి వెళ్తారని ప్రశ్నించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించామని రాజధానిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. జగన్ ఇంకా మావిగన్ ( Mavigan) అంటూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ వైఖరిలో ఏమాత్రం మార్పు లేదన్నారు. జగన్ అండ్ కో కుట్రులను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. అమరావతి దేవతల రాజధాని అని, జగన్ ఎన్ని కుట్రలు పన్నినా ఏం చేయలేరని స్పష్టం చేశారు