అందుకే కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు
Actor ProfilePolitician

అందుకే కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అందుకే కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు
Eenadu20 Jun 2026
అందుకే కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు

హైదరాబాద్‌: మూసీ పునరుద్ధరణకు భాజపా వ్యతిరేకం కాదని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. బాధితులకు న్యాయం చేశాక, ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. గాంధీ సరోవర్‌ ప్రాజెక్టుకు రక్షణశాఖ అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఫణికుమార్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణి స్కామ్‌ బయటపడుతుందనే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తున్నారని ఆరోపించారు. వర్గపోరు కారణంగానే ప్రాంతీయ పార్టీలు చీలిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా కొన్ని స్కూళ్లలోనే పుస్తకాలు, యూనిఫాంలు ఇచ్చారు. కనీస మౌలిక సదుపాయాలు లేని బడులు లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఎలా ఉందో రేవంత్‌రెడ్డి చూడాలి. ప్రైవేటు పాఠశాలలు ఎందుకు పెరుగుతున్నాయి? కేంద్రీయ విద్యాలయాలకు ఉన్న ఆదరణ ప్రభుత్వ బడులకు ఎందుకు లేదు? బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు పెంచాలి. ఉస్మానియా వర్సిటీకి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామన్నారు. కానీ.. వర్సిటీల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. టీచర్లు, ప్రొఫెసర్లు హక్కుల గురించి మాట్లాడితే సస్పెండ్‌ చేస్తున్నారు’’ అని ఆరోపించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు