
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గతంలో ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినీ ప్రయాణం, ప్రణాళికల గురించి మాట్లాడుతూ, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో సినిమాలు తీయకపోవడంపై వస్తున్న ప్రశ్నలకు సమాధానమిచ్చారు. బాలకృష్ణతో ఒకసారి అనిల్ రావిపూడి ఒక ఐడియా చెప్పినప్పుడు సంప్రదించామని, అయితే ఆ సమయంలో బాలకృష్ణ 100వ సినిమా పనుల్లో ఉండడం, అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ తో బిజీగా ఉండడం వల్ల అది ముందుకు సాగలేదని వివరించారు. కేవలం వారి డేట్స్ అందుబాటులో ఉన్నాయని సినిమా చేయనని, తన దగ్గరకు వచ్చే స్క్రిప్టులలో ఆ హీరోలు స్పష్టంగా కనిపించినప్పుడే వారితో సినిమా చేస్తానని దిల్ రాజు స్పష్టం చేశారు. ఎవరైనా స్టార్ హీరోల దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి తనకు పూర్తి స్వేచ్ఛ ఉందని, కానీ సరైన కథ లేకుండా వారిని సంప్రదించనని తెలిపారు. ఇది కూడా చదవండి : Jabardasth Vinod: జబర్దస్త్ లేకపోతే ఆ పని చేసేవాడిని.. అసలు విషయం చెప్పిన లేడీ గెటప్ వినోద్ కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం గురించి మాట్లాడుతూ.. ఒకసారి రాజమౌళి గారు తనతో మాట్లాడుతూ, "మీరు ఇంత మంది కొత్త దర్శకులకు జీవితాన్ని ఇస్తున్నారు. నేను మీకు సినిమా చేస్తే అది ఒక సినిమా అవుతుంది. మీరు సినిమా చేస్తే ఒక దర్శకుడు పుడతాడు" అని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ మాట తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, విఫలమైన దర్శకులకు, కొత్తగా వస్తున్న వారికి సరైన ప్లాట్‌ఫామ్ ఇవ్వడం తన లక్ష్యమని తెలిపారు. పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల వంటి పెద్ద దర్శకులతో ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదని చెప్పారు. అయితే, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. త్రివిక్రమ్ రైటర్‌గా ఉన్నప్పటి నుంచి తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని వివరించారు. ఇది