
ప్రస్తుతం మన భూమి చుట్టూ లోఎర్త్ ఆర్బిట్ లో 14,000 కంటే ఎక్కువ శాటిలైట్లు తిరుగుతున్నాయి. స్పేస్ హిస్టరీలోనే ఇది చాలా పెద్ద నంబర్. కానీ, రాబోయే రోజుల్లో ఈ నంబర్ ఏకంగా వంద రెట్లకు పైగా పెరగబోతోంది. వివిధ ప్రైవేట్ కంపెనీలు, దేశాలు కలిసి రాబోయే ఏళ్లలో ఏకంగా 17 లక్షల కొత్త శాటిలైట్లను అంతరిక్షంలోకి లాంచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి. అయితే, ఈ నిర్ణయం వల్ల గ్రౌండ్ బేస్డ్ అస్ట్రానమీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ‘యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ’ (ESO) చేసిన ఒక తాజా పీర్ రివ్యూడ్ స్టడీ హెచ్చరించింది. ఈ శాటిలైట్ల వల్ల రాత్రి పూట ఆకాశం సాధారణం కంటే నాలుగు రెట్లు ఎక్కువ వెలుగుతో నిండిపోతుందని, దీనివల్ల ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్‌లు ప్రతి రాత్రీ కొన్ని గంటల పాటు పూర్తిగా బ్లైండ్ అయిపోతాయని ఈ స్టడీ స్పష్టం చేసింది. ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని తిరిగి వెనక్కి తీసుకోలేని 'పాయింట్ ఆఫ్ నో రిటర్న్' గా అభివర్ణిస్తున్నారు. ఈ అంతరిక్ష సంక్షోభానికి ప్రధాన కారణం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) కంపెనీయే. ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఇప్పటికే వేలాది స్టార్‌లింక్ శాటిలైట్లను నడుపుతున్న ఈ కంపెనీ, అంతరిక్షంలో ఒక డేటా సెంటర్ నెట్‌వర్క్‌ను క్రియేట్ చేయడం కోసం మరో 10 లక్షలకు పైగా అదనపు శాటిలైట్లను లాంచ్ చేయడానికి రెగ్యులేటర్లకు దరఖాస్తు చేసుకుంది. స్పేస్‌ఎక్స్ మాత్రమే కాదు, ‘ఇ-స్పేస్’ అనే శాటిలైట్ స్టార్టప్ కంపెనీ కూడా ‘సిన్నమోన్’ పేరుతో లక్షలాది శాటిలైట్లను పంపేందుకు ప్లాన్ చేస్తోంది. అటు చైనా కూడా సీటీసీ-1, సీటీసీ-2 పేరుతో రెండు భారీ నెట్‌వర్క్‌ల ద్వారా లక్షలాది శాటిలైట్లను పంపడానికి సిద్ధమవుతోంది. ఇక అన్నింటికంటే షాకింగ్ ఏంటంటే.. ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ అనే కంపెనీ ఏకంగా 50,000 మిర్రర్ శాటిలైట్లను పంపాలని చూస్తోంది. ఇవి రాత్రి వేళల్లో సూర్యుడి వెలుగును నేరుగా