
ఇంటర్నెట్‌డెస్క్: నటీనటులు బయట కనిపిస్తే, వారిని వెంబడిస్తూ వీడియోలు, ఫొటోలు తీయడం మనం చూస్తూనే ఉన్నాం. ఎయిర్‌పోర్ట్‌లు, జిమ్‌ల నుంచి బయటకు వస్తున్న వారి వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇలా వీడియోలు తీస్తున్న పలువురి అత్యుత్సాహం స్టార్‌లను సైతం ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడిది అంత్యక్రియలకూ పాకింది. ఈ వ్యవహారశైలిపై నటి రాధికా శరత్‌కుమార్ (Radikaa Sarathkumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ (K Bhagyaraj) గుండెపోటుతో కన్ను మూసిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు, పలువురు అభిమానులు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు.. నటీనటులు భావోద్వేగాలకు గురైన ఫొటోలు, వీడియోలు తీసి, వాటిని సోషల్‌మీడియాలో పంచుకున్నారు. అవి కాస్త వైరల్ అయ్యాయి. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ‘అంత్యక్రియలనేవి దుఃఖంతో బాధపడుతున్న కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం. హంగామా చేసేందుకు, వ్యూస్ కోసం ప్రయత్నించే వేదిక కాదు. అంతిమ సంస్కారాల సమయంలో కచ్చితంగా మీడియాను నిషేధించాల్సిందే’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ను నటి రాధిక సమర్థించారు. ‘కచ్చితంగా నిషేధం విధించాలి’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భాగ్యరాజ్‌తో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ‘‘50ఏళ్ల స్నేహానికి తుది వీడ్కోలు. అద్భుత సృష్టికర్త, పరిణతి కలిగిన రచయిత, సినిమాకు అద్భుతమైన సరిహద్దులు నిర్దేశించిన వ్యక్తి. ఆయనతో పంచుకున్న చిరునవ్వుల జ్ఞాపకాలెన్నో. ఎక్కడా ఆర్భాటం లేకుండా ప్రతి సందర్భంలోనూ నా కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి. నిజంగా ఇది షాకింగ్ వీడ్కోలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు, అభిమానులు బాధాతప్త హృదయంతో నివాళులర్పించాల్సిన ప్రదేశం ఒక సర్కస్ అయిపోయింది. ఇంత కఠినంగా మనం ఎప్పుడు మారిపోయాం. ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ దీనిపై చర్చించాలి. అంత్యక్రియల సమయంలో సరైన ప్రొటోకాల్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. చనిపోయిన వారి భౌతిక కాయానికి, ఆత్మకు సముచిత గౌరవం ఇవ్వాలి’’ అని