అంటార్కిటికాలో ఆశాకిరణం
Actor ProfilePolitician

అంటార్కిటికాలో ఆశాకిరణం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అంటార్కిటికాలో ఆశాకిరణం
Sakshi6 Sept 2026
అంటార్కిటికాలో ఆశాకిరణం

క్యాన్సర్‌ చికిత్సలో, సాధారణ కణజాలానికి నష్టం కలగకుండా క్యాన్సర్‌ కణాలను నాశనం చేయడమనేది అతి పెద్ద సవాలు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడా (యూఎస్‌ఎఫ్‌) శాస్త్రవేత్తల పరిశోధన కొత్త ఆశను రేకెత్తిస్తోంది. అంటార్కిటికాలో గడ్డ కట్టిన నీటి అడుగున నివసించే ఒక సముద్రజీవి భవిష్యత్‌లో క్యాన్సర్‌ చికిత్సలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన మానవ కణాలకు నష్టం కలిగించకుండా క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగపడే అంటార్కిటిక్‌ సీ స్క్విర్ట్‌ జాతి బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ క్యాన్సర్‌ చికిత్సలో ఒక ముందడుగు అని చెబుతున్నారు. ‘సీ స్క్విర్ట్‌’ను అసిడియన్స్‌ అని కూడా పిలుస్తారు. భూమిపై అత్యంత కఠినమైన వాతావరణంలో అంటార్కిట్‌ జాతులు లక్షలాది సంవత్సరాలుగా పరిణామం చెందుతున్నాయి. వేటాడే జంతువులు, వ్యాధుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రత్యేకమైన రసాయన రక్షణలను (కెమికల్‌ డిఫెన్స్‌) అభివృద్ధి చేసుకున్నాయి. ఈ రక్షణలు కొత్త ఔషధాల తయారీలో బాగా ఉపయోగపడతాయి. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలకు అంటార్కిటికాలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అయినా వెనక్కి తగ్గలేదు. క్యాన్సర్‌ నిరోధక సమ్మేళనాన్ని బ్యాక్టీరియ ఎలా ఉత్పత్తి చేస్తుందో అర్థం చేసుకోవడానికి సీ స్క్విర్ట్‌ డీఎన్‌ఏ, కెమిస్ట్రీ... మొదలైన వాటిని శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేస్తోంది. ఈ ఆవిష్కరణ చికిత్సగా మారడానికి కొంత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు) హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026 (ఫొటోలు) సీఎం విజయ్ తండ్రి బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు) బుల్లితెర డాక్టర్‌ బాబు సతీమణి ఖరీదైన కారు (ఫొటోలు) మాన్సూన్ జ్ఞాపకాల్లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (ఫొటోలు) క్రేజీ కపుల్ ఇద్దరు కలిసి ఏం చేశారో చూడండి ఇలాంటి వాడు MLAనా! మాతో పెట్టుకుంటే.. అడ్వకేట్లు వార్నింగ్ పిచ్ మధ్యలోనే తిట్టుకున్నా SRH ప్లేయర్లు స్టంప్ మైక్ ఆడియో వైరల్ ఏంటి అన్న ఈ