అంగన్ వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
Actor ProfilePolitician

అంగన్ వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అంగన్ వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
NTV Telugu21 Aug 2026
అంగన్ వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ

Anganwadi Working Hours: అంగన్‌వాడీ కేంద్రాల పని వేళలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఎన్నికల విధుల్లో అంగన్‌వాడీ టీచర్లు పాల్గొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల పని వేళల్లో మార్పులు చేసింది. BLO విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, BLO విధులు ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పనిచేయనున్నాయి. ఈ కొత్త పని వేళలు జూన్ 29 నుంచి జూలై 28 వరకు అమల్లో ఉంటాయి. ఇక, ఎన్నికల నిర్వహణలో అంగన్‌వాడీ సిబ్బంది కూడా భాగస్వామ్యం కావాల్సి ఉండటంతో, వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ తాత్కాలిక మార్పులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సంబంధిత అధికారులు ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని ఆదేశించింది. SIRలో భాగంగా ఎన్నికల సంబంధిత విధుల్లో అంగన్‌వాడీ టీచర్లు పాల్గొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బూత్ లెవల్ ఆఫీసర్ బాధ్యతలు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు వెసులుబాటు ఉండేలా.. ఆయా అంగన్‌వాడీ కేంద్రాల పని వేళలను తాత్కాలికంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం