హోసపేటలో అరుదైన దృశ్యం.. ఒకే వేదిక
Actor ProfilePolitician

హోసపేటలో అరుదైన దృశ్యం.. ఒకే వేదిక

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హోసపేటలో అరుదైన దృశ్యం.. ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్
AP7AM20 Jul 2026
హోసపేటలో అరుదైన దృశ్యం.. ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్ణాటకలోని హోసపేటకు చేరుకున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు రూ.51 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన‌నున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు హోసపేటలోని ఐఆర్‌బీ అతిథి గృహంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, సీఆర్ పాటిల్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు. అనంతరం నేతలందరూ కలిసి ప్రాజెక్టు కొత్త గేట్లను లాంఛనంగా ప్రారంభించనున్నారు.2024లో వచ్చిన భారీ వరదలకు తుంగభద్ర డ్యామ్ 19వ నంబర్ గేటు కొట్టుకుపోయింది. అప్పట్లో ప్రత్యామ్నాయంగా స్టాప్ లాక్ గేటును అమర్చారు. అయితే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు శాశ్వత పరిష్కారంగా కొత్త గేట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి అయిన రూ.51 కోట్ల వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భరించాయి. ఈ గేట్ల ప్రారంభం అనంతరం జరగనున్న బహిరంగ సభలో నేతలు ప్రసంగించనున్నారు

హ సప టల అర ద న ద శ య ఒక వ ద క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in