
1990ల చివరలో ప్రారంభమైన ఐటీ విప్లవం హైదరాబాద్ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్‌గూడా వంటి ప్రాంతాలు ప్రపంచస్థాయి వ్యాపార కేంద్రాలుగా ఎదిగాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, డెలాయిట్, యాక్సెంచర్ వంటి సంస్థలు వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించాయి. దేశం నలుమూలల నుంచి యువత ఇక్కడికి వచ్చారు. అధిక వేతనాలు, వేగవంతమైన జీవనశైలి, ఆర్థిక స్వేచ్ఛ నగర సంస్కృతిని కొత్త దిశలో నడిపించాయి. పబ్‌లు, లాంజ్ బార్లు, వీకెండ్ పార్టీలు, ఫామ్‌హౌజ్ ఈవెంట్లు వేగంగా విస్తరించాయి. నైట్ లైఫ్ ఉండటం తప్పు కాదు. ప్రపంచంలోని ప్రతి ఆధునిక నగరంలో అది ఉంటుంది. కానీ వినోదం నియంత్రణ కోల్పోయినప్పుడు, స్వేచ్ఛ బాధ్యతను విస్మరించినప్పుడు, రాత్రి జీవితం చట్టాన్ని సవాలు చేయడం మొదలైనప్పుడు సమస్యలు మొదలవుతాయి. ప్రస్తుతం హైదరాబాదులో వందల సంఖ్యలో పబ్‌లు, నైట్ క్లబ్బులు పని చేస్తున్నాయి. వీటి చుట్టూ కోట్లాది రూపా యల వినోద ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, సెల బ్రిటీ సంస్కృతి యువతలో ఒక భ్రమను సృష్టిస్తున్నాయి. మద్యం సేవించడం, పార్టీలకు హాజరుకావడం వంటివి ఆధునికతకు చిహ్నంగా యువత భావిస్తోంది. ఇదే వాతావరణాన్ని డ్రగ్స్ మాఫియా అవకాశంగా మార్చుకుంటోంది. ఒకప్పుడు గంజాయికి పరిమి తమైన మాదకద్రవ్యాల నెట్‌వర్క్ ఇప్పుడు ఎమ్‌డీఎమ్‌ఏ, ఎల్‌ఎస్‌డీ, కోకైన్ వంటి సింథటిక్ డ్రగ్స్ వరకు విస్తరించింది. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీల సహా యంతో జరిగే అక్రమ వ్యాపారం యువతను లక్ష్యంగా చేసుకుంటోంది. హైదరాబాద్ ఎందుకు డ్రగ్స్ మాఫియాకు ఆకర్షణీయంగా మారింది? అధిక ఆదాయం కలిగిన యువ జనాభా, అంతర్జాతీయ కనెక్టివిటీ, నైౖట్‌లైఫ్, ఫామ్ హౌజ్ సంస్కృతి... ఇవన్నీ కారణాలే. అభివృద్ధి అంటే ఐటీ టవర్లు, ఫ్లైఓవర్లు, మెట్రో రైళ్లు, స్కైస్క్రాపర్లు మాత్రమే కాదు. మహిళలు రాత్రి వేళ భయపడకుండా ప్రయాణించగలగడం, యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, చట్టం పట్ల గౌరవం ఉండటం కూడా అభివృద్ధి సూచికలే. స్వేచ్ఛ–అనాగరికత మధ్య
