హీరోలకు సమానంగా పారితోషికం అందుకున్న ఏకైక విలన్.. చివరకు ఆస్తి అంతా పోయి
Actor ProfileActor

హీరోలకు సమానంగా పారితోషికం అందుకున్న ఏకైక విలన్.. చివరకు ఆస్తి అంతా పోయి

Total News1
Movie Updates0
Sources1
హీరోలకు సమానంగా పారితోషికం అందుకున్న ఏకైక విలన్.. చివరకు ఆస్తి అంతా పోయి
TV9 Telugu17 Jun 2026
హీరోలకు సమానంగా పారితోషికం అందుకున్న ఏకైక విలన్.. చివరకు ఆస్తి అంతా పోయి

తెరపై ఆయన కనిపించగానే జనం జడుసుకునేవారు. సినిమాల్లో ఆయన పాత్ర అంత పవర్‌ఫుల్‌గా ఉండేది. ఆయన మరెవరో కాదు.. నటుడు రాజనాల. ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో ప్రతినాయకుడి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేశాడు. హీరో పాత్రకు ఎంతగా ప్రాధాన్యత ఉంటుందో.. అదే స్థాయిలో విలన్ పాత్ర సైతం ప్రధానం. 1950వ దశకంలో విలన్ పాత్రకు ఆయన వన్నె తెచ్చారు. ఇండస్ట్రీలో రాకముందు తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు ఉన్నప్పటికీ, వాటికి ఒక నిర్దిష్టమైన ముద్ర అంటూ లేదు. రాజనాల రంగప్రవేశంతో విలనీకి సరికొత్త గంభీరత్వం, రాచఠీవి వచ్చాయి. ఒకానొక దశలో రాజనాల పారితోషికం హీరోలకు సమానంగా ఉండేదంటే ఆయనకున్న స్టార్‌డమ్ ఎంతటిదో తెలుస్తుంది. మద్రాసులో ఐదు విశాలమైన భవంతులు, ఎల్లప్పుడూ తిరిగే ఐదు కార్లు ఆయన వైభవానికి నిదర్శనం. విలన్ అంటే ఇలా ఉండాలని చూపించి, తన నటనతో తెలుగు సినిమాకు మరపురాని వారసత్వాన్ని అందించిన రాజనాల ఎప్పటికీ స్మరణీయులే. ఎక్కువ మంది చదివినవి : Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే.. రాజనాల అసలు పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు. జనవరి 3, 1925న నెల్లూరులో జన్మించిన ఆయన, వెండితెరపై కరడుగట్టిన విలన్‌గా మెప్పించినప్పటికీ.. నిజ జీవితంలో మాత్రం ఎంతో విద్యావంతుడు, దయా హృదయుడు కావడం విశేషం. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన దగ్గరకు వెళ్లేందుకు జనం భయపడేవారు. ముఖ్యంగా మహిళలు ఆయనను చూసి భయపడేవారు. తన సినీ ప్రయాణంలో దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించారు రాజనాల. ఎన్టీఆర్‌, ఎం.జి.ఆర్‌, జయలలిత.. ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత దక్కించుకున్నారు. ఎక్కువ మంది చదివినవి : పెళ్లి ఫంక్షన్లలో పని.. రూ.500 జీతం కోసం ఎన్నో కష్టాలు.. కట్‌చేస్తే టాలీవుడ్ క్వీన్.. సినిమాల్లో విలనిజంతో మెప్పించిన రాజనాల.. 1970వ దశకం సినిమా సైలెంట్ అయ్యారు. కొత్త విలన్స్