హీరోయిన్ గా కాదు.. నిర్మాతగా సమంత మాస్టర్ ప్లాన్ రెడీ
Actor ProfileActor

హీరోయిన్ గా కాదు.. నిర్మాతగా సమంత మాస్టర్ ప్లాన్ రెడీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హీరోయిన్ గా కాదు.. నిర్మాతగా సమంత మాస్టర్ ప్లాన్ రెడీ
Telugu Times18 Aug 2026
హీరోయిన్ గా కాదు.. నిర్మాతగా సమంత మాస్టర్ ప్లాన్ రెడీ

సమంత(Samantha) కెరీర్‌లో కొత్త చాప్ట‌ర్ కు నాంది పలికిన మా ఇంటి బంగారం(Maa inti bangaram) సక్సెస్ తర్వాత ఆమె దృష్టి ఇప్పుడు మరో కీలక రంగంపై పడినట్లు తెలుస్తోంది. నటిగా స‌క్సెస్ ల‌ను కంటిన్యూ చేయ‌డమే కాకుండా, కంటెంట్‌కు ప్రాధాన్య‌మిచ్చే నిర్మాతగా తన ముద్ర వేయాలనే ఆలోచనలో సమంత ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. తన భర్త రాజ్‌(Raj)తో కలిసి యంగ్ డైరెక్ట‌ర్లు, కొత్త నటీనటులకు అవకాశాలు కల్పించేలా వరుస ప్రాజెక్ట్‌లను రూపొందించే దిశగా ప్లాన్లు రెడీ చేస్తున్నట్లు సమాచారం. కమర్షియల్ ఫార్ములాల కంటే కొత్త కథలకు పెద్దపీట వేయాలన్న టార్గెట్ తో ఈ నిర్మాణ సంస్థ ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గతంలో నిర్మించిన శుభం తరహాలో కాకుండా, ఈసారి సమంత పూర్తిగా నిర్మాతగానే వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొత్తగా రూపొందే సినిమాల్లో ఆమె నటించే అవకాశాలు లేకపోయినా, కథల ఎంపిక నుంచి నిర్మాణ నాణ్యత వరకు ప్రతి అంశాన్ని స్వయంగా పర్యవేక్షించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మెటర్నిటీ బ్రేక్‌ను ఆస్వాదిస్తున్న ఆమె, ఇదే సమయాన్ని బలమైన ప్రొడక్షన్ ప్లానింగ్‌కు వినియోగిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ డైరెక్ట‌ర్ల‌తో క‌థా చర్చలు పూర్తయ్యాయని, విభిన్న కాన్సెప్ట్‌లతో కూడిన ప్రాజెక్ట్‌లు తుది దశకు చేరుకున్నాయని ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌ల కన్నా బలమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాల‌పై సమంత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే నెలల్లో ఈ కొత్త నిర్మాణాలపై అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని సమాచారం. నిర్మాతగా సమంత చేపట్టనున్న ఈ కొత్త ప్రయాణం టాలీవుడ్‌కు మరింత మంది ప్రతిభావంతులను పరిచయం చేసే వేదికగా మారుతుందా అన్న ఆసక్తి ఇప్పుడు సినీ అభిమానుల్లో నెలకొంది

హ ర య న గ క ద న ర మ తగ సమ త మ స టర ప ల న ర డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in