హీరో అఖిల్ రాజ్ ఇంటి
Actor ProfileActor

హీరో అఖిల్ రాజ్ ఇంటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హీరో అఖిల్ రాజ్ ఇంటిపై.. దాడికి డెలివరీ బాయ్స్ యత్నం! పోలీస్ స్టేషన్ వద్ద హంగామా
Chitrajyothy25 Aug 2026
హీరో అఖిల్ రాజ్ ఇంటిపై.. దాడికి డెలివరీ బాయ్స్ యత్నం! పోలీస్ స్టేషన్ వద్ద హంగామా

నటుడు అఖిల్ రాజ్ కు ఓ డెలవరీ బాయ్ కు మధ్య జరిగిన గొడవ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. రాజు వెడ్స్ రాంబాబు పేం నటుడు అఖిల్ రాజ్ (akhil raj) కు ఓ డెలవరీ బాయ్ (delivery boy)కు మధ్య జరిగిన గొడవ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం మధ్యాహ్నం డెలివరీ బాయ్ రమేష్ సుమారు 50మంది డెలివరీ బాయ్స్ తో వచ్చి అఖిల్ రాజ్ ఇంటిపై దాడికి యత్నించారు. దీంతో అబిల్ రాజ్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆరుగురు ప్రధాన నింది తులను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న డెలివరీ బాయ్స్ సుమారు 100 మంది వరకు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని హంగామా చేశారు. ఇదిలా ఉండగా డెలివరీ బాయ్పైపై అఖిల్ దాడి చేసినట్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తిన పోస్టులు, నెగిటివ్ కామెంట్లపై అఖిల్ స్పందించారు. దీనిపై ఇన్ స్టా వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. 'మా ఇంట్లో ఎవరూ ఆర్డర్ చేయకుండా డెలివరీ బాయ్ పార్సిల్ తెచ్చి ఇచ్చి వెళ్లాడు. మా అమ్మకు తెలియకుండా దానిని ఓపెన్ చేసింది. ఆ తర్వాత డెలివరీ బాయ్ వచ్చి పార్సిల్ ఇతరులదని, తిరిగి ఇవ్వమని అడగగా.. ఓటీపీ, పేరు సరిచూసుకోకుండా ఎలా ఇచ్చావని నేను అడిగాను. దానికి అతను ఫ్రీగా వస్తే ఓపెన్ చేసి తీసుకుంటారా అని దురుసుగా మాట్లాడాడు. దాంతో కోపంతో వాగ్వాదం జరిగింది' అని తెలిపారు

హ ర అఖ ల ర జ ఇ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in