హైదరాబాద్ లోని లాడ్జ్ లో యువతి అనుమానాస్పద మృతి
Actor ProfilePolitician

హైదరాబాద్ లోని లాడ్జ్ లో యువతి అనుమానాస్పద మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ లోని లాడ్జ్ లో యువతి అనుమానాస్పద మృతి
Andhra Jyothy7 Sept 2026
హైదరాబాద్ లోని లాడ్జ్ లో యువతి అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌ లంగర్‌హౌస్ పరిధిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మృతురాలిని రేణుకగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, జులై 3: నగరంలోని లంగర్‌హౌస్ పరిధిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మృతురాలిని రేణుక(26)గా పోలీసులు గుర్తించారు. హోటల్ గ్రాండ్ లాడ్జ్‌లో సదరు యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించినట్లు తెలిపారు. ఫారూఖ్ అనే వ్యక్తితో కలిసి రేణుక హోటల్‌లో గది బుక్ చేసుకుంది. అనంతరం ఫారూఖ్ బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి రేణుక ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అయితే.. ఇది ఆత్మహత్య కాదని, తమ కుమార్తెను హత్య చేశారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న లంగర్‌హౌస్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫారూఖ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతిది హత్యా, ఆత్మహత్యా అనే దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన లంగర్‌హౌస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘోర రోడ్డుప్రమాదం.. స్పందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

హ దర బ ద ల న ల డ జ ల య వత అన మ న స పద మ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in