హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ షేర్లు కొనొచ్చా
Actor ProfileCelebrity

హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ షేర్లు కొనొచ్చా

Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ షేర్లు కొనొచ్చా
TV9 Telugu15 Jun 2026
హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ షేర్లు కొనొచ్చా

ఎలాన్ మస్క్.. భూ మండలంపైనే ఫస్ట్ ట్రిలియనీర్ గా అవతరించాడు. లక్ష కోట్ల రూపాయల వ్యక్తిగత ఆస్తులతో చరిత్ర సృష్టించాడు. 2026, జూన్ 12వ తేదీన ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యింది. ఐపీవో అంచనాలను మించి సక్సెస్ అయ్యింది. ఒక్కో షేరును 135 డాలర్లుగా నిర్ణయించి మొత్తం 555 మిలియన్ షేర్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ద్వారా 75 బిలియన్ డాలర్లను సమీకరించింది. స్పేస్ ఎక్స్ షేర్లకు నాలుగు రెట్లు డిమాండ్ ఎక్కువ వచ్చింది. నాస్‌డాక్‌లో ప్రారంభ ట్రేడింగ్ సమయంలో స్పేస్ ఎక్స్ కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 1.77 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఉద్యోగులకు ఇచ్చిన స్టాక్స్, ఇతర వాటా యూనిట్లను పరిగణలోకి తీసుకుంటే దాని విలువ 1.80 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. రాకెట్ ప్రయోగాలు, శాటిలైట్ బ్రాడ్ బ్రాండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష పరిశోధనలతో స్పేస్ ఎక్స్ దూసుకెళ్తుంది. ఎలాన్ మస్క్ ఆలోచనలకు పెట్టుబడిదారులు మరింత విశ్వాసంగా ఉండటం కలిసొచ్చింది. స్పేస్ ఎక్స్ ఐపీవోకు వచ్చిన స్పందన చూసిన తర్వాత.. రాబోయే ఓపెన్ AI, ఆంథ్రోపిక్ ఐపీవోలపై భారీ అంచనాలు పెరిగాయి. ఆ రెండు కంపెనీలు సైతం ట్రిలియన్ డాలర్ల విలువను చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. స్పేస్ ఎక్స్ ఐపీఓను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమెరికాలోని పలు నగరాల్లో ఆందోళనలు జరిగాయి. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్, వాల్ స్ట్రీట్ , జేపీ మోర్గాన్ కార్యాలయం ఎదుట ‘స్టాప్ ఫండింగ్ బిలియనీర్స్’ కూటమి నేతృత్వంలోని కార్మిక సంఘాలు ఈ నిరసనలు చేపట్టాయి. ఈ వ్యతిరేకతకు ముఖ్య కారణం ఉద్యోగుల పెన్షన్ నిధులు రిస్క్ లో పడటమే.శ్రామికుల రిటైర్మెంట్ ఫండ్స్, పెన్షన్ డబ్బులను స్పేస్ ఎక్స్ వంటి భారీ మార్కెట్ క్యాప్ గల హై-రిస్క్ కంపెనీల్లో మదుపు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. అమెరికా రాజకీయాల్లో ఎలాన్