
దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు మెహర్ రమేశ్. ఇన్నేళ్లుగా ఒక్కటంటే ఒక్క హిట్ లేకపోయినా కూడా నెట్టుకుంటూ వస్తున్నారు. అసలు వరుస విమర్శలు, ఫ్లాప్‌లు ఎదురైనా ఆయనకు అవకాశాలు ఎలా వస్తున్నాయి. పెద్ద హీరోలు కూడా ఆయన సినిమాలు చేయడానికి కారణమేంటి? మెహర్ రమేశ్ దర్శకుడిగా మారకముందు ఆయన పలు ఇండస్ట్రీలో కొన్ని విభాగాల్లో పనిచేశారు. మహేశ్ బాబు బాబీ సినిమాలోనూ యాక్ట్ చేశారు. అయితే మెహర్ రమేశ్ సినిమా ఇండస్ట్రీలో ఇంకా కొనసాగడానికి కారణం...దర్శకధీరుడు రాజమౌళితో ఉన్న కుటుంబ బంధం కారణమని చర్చ ఉంది. అయితే, ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చిన తర్వాత వాటిని నిలబెట్టుకోవడం మాత్రం ప్రతి ఒక్కరి సొంత ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. మెహర్ రమేష్ దర్శకుడిగా తన ప్రయాణాన్ని కన్నడ చిత్ర పరిశ్రమతో ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగులో పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్నారు. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేయడంతో టాలీవుడ్ లో ఆయన పేరు ఒక్కసారిగా వినిపించింది. కన్నడలో వీర కన్నడిగ, అజయ్ సినిమాలతో బాక్ టు బాక్ హిట్లు కొట్టారు. ఆ తర్వాత కంత్రి, బిల్లా, శక్తి, షాడో, భోళాశంకర్ తీశారు. వీటిలో బిల్లా తప్పా మిగతావన్నీ భారీ డిజాస్టర్లే. భోళాశంకర్ సినిమా...చిరంజీవి కెరీర్ లో అట్టర్ ప్లాప్ మూవీ ఇది. మెహర్ రమేష్ కెరీర్‌లో అన్ని భారీ బడ్జెట్ సినిమాలే. కొన్ని సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, హైప్ ఉన్నప్పటికీ ఫలితం ఆశించిన విధంగా రాకపోవడంతో సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. చివరకు ఆయన సినిమాలు మీమ్స్‌గా మారాయి. దీంతో కొత్త సినిమా వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా పెరిగింది. ఇండస్ట్రీలో విజయం ఒక్కటే ప్రమాణం కాదు. ఒక దర్శకుడు సెట్‌లో ఎలా పని చేస్తాడు, నిర్మాత బడ్జెట్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడు, హీరోతో ఎలా