హోటల్లో పని చేసిన బీహార్ కుర్రాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీని శాసిస్తున్న నటుడు.. ఎవరంటే
Actor ProfileActor

హోటల్లో పని చేసిన బీహార్ కుర్రాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీని శాసిస్తున్న నటుడు.. ఎవరంటే

Total News1
Movie Updates0
Sources1
హోటల్లో పని చేసిన బీహార్ కుర్రాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీని శాసిస్తున్న నటుడు.. ఎవరంటే
TV9 Telugu15 Jun 2026
హోటల్లో పని చేసిన బీహార్ కుర్రాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీని శాసిస్తున్న నటుడు.. ఎవరంటే

సినీరంగుల ప్రపంచంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. ఎన్నో సవాళ్లు, అడ్డంకులు దాటుకుని తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక నటుడు.. విద్యను పూర్తి చేసిన తర్వాత పాట్నాలోని హోటల్లో పనిచేశాడు. అతడు మరెవరో కాదు.. పంకజ్ త్రిపాఠి. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్' (2012) చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత 'మిర్జాపూర్', 'న్యూటన్', 'స్త్రీ' వంటి చిత్రాలలో అద్భుతమైన పాత్రలు పోషించారు. పాట్నాలోని ఒక హోటల్ వంటగదిలో పనిచేయడం నుండి బీహార్‌లోని అత్యంత ప్రసిద్ధ నటులలో ఒకరిగా ఎదగడం వరకు, పంకజ్ త్రిపాఠి ప్రయాణం పట్టుదల , ప్రతిభకు ఒక స్ఫూర్తిదాయకమైన గాథ. పంకజ్ త్రిపాఠి 1976 సెప్టెంబర్ 5న బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా, బెల్సండ్ గ్రామంలో జన్మించారు. ఆయన ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. ఆయన తండ్రి, పండిట్ బనారస్ తివారీ, ఒక రైతు , మతగురువు. ఎక్కువ మంది చదివినవి : Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే.. స్కూల్ డేస్ కంప్లీట్ అయ్యాక అతడు హోటల్ మేనేజ్‌మెంట్ శిక్షణ కోసం పాట్నాకు వెళ్లాడు. అక్కడే అతడికి నటనపై ఆసక్తి పెరిగింది. 1990ల ప్రారంభంలో అతను పాట్నాలోని ఒక హోటల్‌లో పనిచేశాడు. నటనను సీరియస్‌గా కెరీర్‌గా ఎంచుకోవాలని నిశ్చయించుకుని, అతను ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD)కి దరఖాస్తు చేసుకుని, 2004లో పట్టభద్రుడయ్యాడు. సినిమాలు, సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. పంకజ్ త్రిపాఠి 1993లో తాను కలిసిన మృదుల త్రిపాఠిని వివాహం చేసుకున్నారు, వారికి ఆశి త్రిపాఠి అనే కుమార్తె ఉంది. ఎక్కువ మంది చదివినవి : పెళ్లి ఫంక్షన్లలో పని.. రూ.500 జీతం కోసం ఎన్నో కష్టాలు.. కట్‌చేస్తే టాలీవుడ్ క్వీన్.. పంకజ్ త్రిపాఠి