హే చికీతా' టీజర్ రిలీజ్.. పవన్ కళ్యాణ్ ప్రేరణతో రైతుల
Actor ProfileActor

హే చికీతా' టీజర్ రిలీజ్.. పవన్ కళ్యాణ్ ప్రేరణతో రైతుల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హే చికీతా' టీజర్ రిలీజ్.. పవన్ కళ్యాణ్ ప్రేరణతో రైతులపై సినిమా తీశామంటున్న దర్శకుడు
10TV Telugu3 Aug 2026
హే చికీతా' టీజర్ రిలీజ్.. పవన్ కళ్యాణ్ ప్రేరణతో రైతులపై సినిమా తీశామంటున్న దర్శకుడు

Hey Chikittha Teaser : అభినవ్ మణికంఠ, దివిజ, తన్మయి కుషి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా హే చికీతా. అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పి బ్యానర్స్ పై ఎన్.అశోక ఆర్ఎన్ఎస్, గరుడవేగ అంజి నిర్మాణంలో ధన్ రాజ్ లెక్కల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. హే చికీతా సినిమా జూలై 24న రిలీజ్ కానుండగా తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్ కి సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్, దర్శకులు జి.నాగేశ్వర్ రెడ్డి, నిర్మాతలు సి.కళ్యాణ్, దామోదర్ ప్రసాద్.. పలువురు గెస్టులుగా హాజరయ్యారు. డైరెక్టర్ ధన్ రాజ్ లెక్కల మాట్లాడుతూ.. నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఊర్లో ఉండే ఓ ఐదుగురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేశారు అన్నది ఈ సినిమా కథ. అందుకే హే చికీతా టైటిల్ పెట్టాం. పవన్ కళ్యాణ్ ప్రతీ సినిమాలో ఇంట్రో సాంగ్‌లో మూడు నిమిషాల పాటు సందేశాన్ని ఇస్తారు. నేను అదే లైన్‌తో రైతుల గురించి మూడు గంటల పాటు సినిమా తీశాను అని తెలిపారు. నిర్మాత గరుడవేగ అంజి మాట్లాడుతూ.. కొత్త కథల్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ బ్యానర్లను ప్రారంభించాం. మా ఆధ్వర్యంలో మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. జూలై 24న మా సినిమా రిలీజ్ కానుంది అని తెలిపారు. సీనియర్ దర్శకులు నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను. చాలా బాగుంది. ధన్ రాజ్‌కి తెలంగాణ ప్రాంతం మీద చాలా పట్టుంది. అదే మనకు తెరపై కనిపిస్తుంది. సినిమాలో పవనిజం ఉంటుంది అని తెలిపారు

హ చ క త ట జర ర ల జ పవన కళ య ణ ప ర రణత ర త ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in