
Child Artist Myra Dandekar:అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘హలో’ సినిమా ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండే చిత్రాల్లో ఒకటి. ఈ సినిమాలో చిన్నారి జున్ను పాత్రలో కనిపించిన మైరా దండేకర్ తన అమాయకమైన నటనతో అందరి మనసులు గెలుచుకుంది. చిన్న వయసులోనే తన సహజమైన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు పూర్తిగా మారిపోయి యువతిగా కనిపిస్తోంది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘హలో’ సినిమా ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండే చిత్రాల్లో ఒకటి. ఈ సినిమాలో చిన్నారి జున్ను పాత్రలో కనిపించిన మైరా దండేకర్ తన అమాయకమైన నటనతో అందరి మనసులు గెలుచుకుంది. చిన్న వయసులోనే తన సహజమైన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు పూర్తిగా మారిపోయి యువతిగా కనిపిస్తోంది. ‘హలో’ సినిమా విడుదలై దాదాపు తొమ్మిదేళ్లు పూర్తవుతున్నాయి. అప్పట్లో తెరపై కనిపించిన చిన్నారి మైరా ఇప్పుడు స్టైలిష్ లుక్‌తో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఆమె ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండగా, చాలా మంది అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు అమాయకమైన చిన్నారిగా కనిపించిన మైరా, ఇప్పుడు ఎంతో అందంగా మరియు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ చిన్ననాటి పాత్రను మైరా పోషించింది. జున్ను పాత్రలో ఆమె నటన ప్రేక్షకులకు బాగా నచ్చింది. ముఖ్యంగా అఖిల్ చిన్ననాటి పాత్రతో కలిసి వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. అందుకే ఇప్పటికీ చాలామంది ఆమెను జున్ను పేరుతోనే గుర్తుంచుకున్నారు. ఇటీవల మైరా, కళ్యాణి ప్రియదర్శన్‌తో కలిసి దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ చిత్రాలు అభిమానులలో పాత జ్ఞాపకాలను గుర్తు చేశాయి. ‘హలో’ సినిమాలో చిన్న జున్ను, పెద్ద జున్నుగా కనిపించిన ఇద్దరూ మళ్లీ కలిసి కనిపించడంతో సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం మైరా తన చదువులపై దృష్టి పెట్టడంతో పాటు సోషల్ మీడియాలో కూడా