హర్మూజ్ లో టోల్ ఉండదు కానీ.. ఇరాన్ మెలిక
Actor ProfilePolitician

హర్మూజ్ లో టోల్ ఉండదు కానీ.. ఇరాన్ మెలిక

Total News1
Movie Updates0
Sources1
హర్మూజ్ లో టోల్ ఉండదు కానీ.. ఇరాన్ మెలిక
Eenadu16 Jun 2026
హర్మూజ్ లో టోల్ ఉండదు కానీ.. ఇరాన్ మెలిక

ఇంటర్నెట్‌డెస్క్‌: హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ మెలిక పెట్టింది. టోల్‌ ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రకటించగా.. కొంత సర్వీస్‌ ఛార్జీగా వసూలుచేస్తామని ఇరాన్ చెప్తోంది (Trump-Iran). ఈ ఛార్జీల విషయాన్ని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బకేయి మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ‘‘నౌకలు హర్మూజ్‌ (Strait of Hormuz)లో ప్రయాణిస్తున్నందుకు ట్రాన్సిట్‌ టోల్‌ వసూలు చేయబోం. ఇదే విషయాన్ని ఎప్పటినుంచో చెప్తున్నాం. అయితే నావిగేషన్ సర్వీసులు, పర్యావరణ పరిరక్షణ, నౌకలకు బీమా, ఇతర సముద్రయాన సర్వీసులకు మాత్రం ఛార్జీలు వసూలు చేస్తాం’’ అని వెల్లడించారు. అలాగే యుద్ధం ముగించేందుకు ఒక ఒప్పందానికి వచ్చినప్పటికీ.. అమెరికాను విశ్వసించలేమని పేర్కొన్నారు. గత అనుభవాలే తమ అభిప్రాయానికి కారణమని తెలిపారు. అంతర్జాతీయ సముద్ర చట్టాన్ని పర్యవేక్షించే యునైటెడ్ నేషన్స్ ఒప్పందాల ప్రకారం.. తమ సరిహద్దుగా ఉన్న జలసంధి మీదుగా నౌకలు వెళ్లడానికి ఆయా దేశాలు ఫీజు వసూలుచేయడానికి అనుమతి లేదు. అయితే పైలటింగ్, టగ్గింగ్, పోర్ట్ సర్వీసులు అందిస్తే.. పరిమిత స్థాయిలో ఫీజు వసూలు చేసుకోవచ్చు. ఈ ఫీజు పేరిట ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకోకూడదు. జలసంధి సహజంగా ఏర్పడుతుంది. అలాకాకుండా తవ్వడం ద్వారా ఏర్పడిన కాలువలను జలసంధికి భిన్నంగా పరిగణిస్తారు. అదే సమయంలో అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకమైన సూయిజ్, పనామా కాలువల విషయంలో ఈజిప్ట్‌, పనామా దేశాలు కొంత రుసుము వసూలు చేయడానికి అనుమతి ఉంది. సూయిజ్‌కు ఈజిప్ట్‌ కొంత భూమి ఇవ్వడం వల్లే ఆ అనుమతి లభించింది. కాగా.. సుంకాలు విధిస్తే హర్మూజ్‌లో యుద్ధానికి ముందున్న స్థితి ఎప్పటికీ తిరిగి రాకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు