హనీమూన్ ట్రిప్ లో విషాదం...హోటల్ రూమ్ లో నగ్నంగా రక్తపు మడుగులో నవవధువు
Actor ProfilePolitician

హనీమూన్ ట్రిప్ లో విషాదం...హోటల్ రూమ్ లో నగ్నంగా రక్తపు మడుగులో నవవధువు

Total News1
Movie Updates0
Sources1
హనీమూన్ ట్రిప్ లో విషాదం...హోటల్ రూమ్ లో నగ్నంగా రక్తపు మడుగులో నవవధువు
TeluguOne16 Jun 2026
హనీమూన్ ట్రిప్ లో విషాదం...హోటల్ రూమ్ లో నగ్నంగా రక్తపు మడుగులో నవవధువు

హనీమూన్ ప్రయాణం అంటే సరికొత్త జీవితానికి అందమైన పునాది. ఎన్నో ఆశలు, మరెన్నో ఊహలతో ఆ కొత్త జంట తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ ఆనందం కేవలం కొన్ని నెలలకే ఆవిరైపోయింది. ఊహించని రీతిలో ఆ నవవధువు ఓ హోటల్ గదిలో శవమై తేలింది. అదీ కూడా బట్టలు లేకుండా, ఒంటి నిండా రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె భీభత్స స్థితిని చూసి హోటల్ సిబ్బందితో పాటు స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందమైన పర్యాటక ప్రాంతంలో జరిగిన ఈ ఘోర ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు ఆ రాత్రి ఆ మూసి ఉన్న గదిలో ఏం జరిగిందనే కోణంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ దారుణ ఉదంతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రిషికేశ్ పరిధిలోని ముస్సోరీలో వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన సౌమ్యశ్రీచరణ్, రాధా గాయత్రి అనే యువతీ యువకులకు గత ఏడాది అంటే 2025 నవంబర్ 8వ తేదీన ఎంతో వైభవంగా వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత ఈ జంట దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లోని గురుగ్రామ్‌లో నివాసం ఉంటూ, అక్కడ ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. దాదాపు ఏడు నెలల వైవాహిక జీవితం సాఫీగా సాగిన తర్వాత, వారు హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే జూన్ 14వ తేదీ ఆదివారం నాడు ఈ జంట ఢిల్లీ నుంచి రిషికేశ్‌కు బయలుదేరి వెళ్లింది. ముస్సోరీ చేరుకున్న తర్వాత వారు అక్కడ ఉన్న ఒక హోమ్‌స్టే (హోటల్ రూమ్) లో బస చేశారు. ఆదివారం రోజంతా ఎంతో సంతోషంగా గడిపిన ఆ దంపతులు రాత్రి తమ గదిలోకి వెళ్లారు. అయితే, సోమవారం తెల్లవారుజామున హోటల్ సిబ్బంది ఏదో పనిమీద ఆ రూమ్ వద్దకు వెళ్లేసరికి అక్కడి దృశ్యం చూసి