
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Pawan Kalyan Fan Niranjan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప-ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ యువ అభిమానికి చిరకాల కోరిక తీర్చారు. సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్న ఆయన.. మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. వరంగల్‌లోని హనుమకొండకు చెందిన నిరంజన్ అనే అభిమాని కోసం డిప్యూటీ సీఎం స్వయంగా కదిలారు. అయితే ఈ క్రమంలో ఓ అభిమాని పవన్ కల్యాణ్‌పైకి దూసుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నిరంజన్ పరామర్శ కోసం హనుమకొండ వెళ్లిన టాలీవుడ్ కథానాయకుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్ అడుగుడుగునా బ్రహ్మరథం పట్టారు. తమ అభిమాన నటుడ్ని చూసేందుకు ప్రేక్షకులు తరలివచ్చారు. అయితే ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌కు అభిమానుల తాకిడి భారీగా పెరిగింది. అయితే నిరంజన్ ను పరామర్శించేందుకు తన కాన్వాయ్ నుంచి బయటకు వచ్చిన క్రమంలో ఓ అభిమాని పవన్ వైపు దూసుకెళ్లాడు. అంతలోనే ఆయన భద్రతా సిబ్బంది అభిమానిని పక్కకు నెట్టేశారు. అభిమాని కోసం కదలి వచ్చి..రూ.1 లక్ష సాయం! అనారోగ్యంతో మంచాన పట్టిన ఆ వ్యక్తి కోసం ఏకంగా పవర్‌స్టార్ ఆ అభిమాని ఇంటికి వెళ్లి పరామర్శించారు. అరుదైన వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న ఓ నిరుపేద అభిమాని చిరకాల కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. ఆర్థిక సాయంగా రూ. లక్ష ఇచ్చి తనలోని మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. అభిమానిని పరామర్శిస్తున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ పట్టణంలోని