
ముంబై: బుల్లితెర నటి సంచిత ఉగలే మరణం వినోద పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముంబైలోని నాలాసోపారాలో గల తన అపార్ట్‌మెంట్‌లో జూన్ 14న ఈ 22 ఏళ్ల నటి ఆత్మహత్య చేసుకుంది. ప్రాథమికంగా దీనిని ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, పలు అనుమానాల మధ్య పోలీసుల విచారణ కొనసాగుతోంది. అయితే సంచిత మరణించిన రెండు రోజుల తర్వాత ఆమె తండ్రి మచ్చింద్ర ఉగలే, కజిన్ ఆకాష్ సతీష్ మీడియా ముందుకు వచ్చి, పరిశ్రమలో తన కుమార్తె ఎదుర్కొన్న వేధింపుల వివరాలను బయటపెట్టారు. నిరంతర వేధింపులు.. డబ్బుల కోసం ఒత్తిడి సంచిత తండ్రి మచ్చింద్ర ఉగలే ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుమార్తె పడిన మానసిక క్షోభను వివరించారు. సంచిత నిరంతరం తీవ్రమైన ఒత్తిడి, వేధింపులకు గురైందని ఆయన ఆరోపించారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను డబ్బుల కోసం లేదా ఇతర ‘విషయాల’ కోసం నిరంతరం బ్లాక్‌మెయిల్ చేస్తూ, తీవ్రమైన టార్చర్‌కు గురిచేశారని అన్నారు. అప్పుడప్పుడు ఆమె తీవ్ర నిరాశలోకి (డిప్రెషన్) జారుకునేదని, అందుకే తాము ఎప్పుడూ ఆమెకు తోడుగా ఉండేవారమని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో పోలిక సంచిత కజిన్ ఆకాష్ సతీష్ ఈ ఘటనపై మాట్లాడుతూ బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని గుర్తుచేశారు. 2020, జూన్ 14న సుశాంత్ ఎలాగైతే ఇండస్ట్రీ ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడో, సరిగ్గా అదే రోజున (జూన్ 14) తన సోదరి కూడా అదే ఇండస్ట్రీ ఒత్తిడి కారణంగా ప్రాణాలు కోల్పోయిందని అన్నారు. చిత్ర పరిశ్రమలో మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఎదుగుతున్న నటీనటులను కొందరు పెద్దలు బెదిరింపులకు గురిచేస్తూ వేధిస్తుంటారన్నారు. వినోద పరిశ్రమలో విషాదం సంచిత ఉగలే పలు ప్రముఖ టెలివిజన్ ధారావాహికల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితం. ప్రముఖ సీరియల్ ‘కుంకుమ భాగ్య’లో