
ప్రస్తుతం సినిమాలకు దీటుగా వెబ్ సిరీస్‌లు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. అలా తెలుగులో బాగా పాపులర్ అయిన వెబ్ సిరీస్ `సేవ్ ది టైగర్స్`. ఇప్పటికే రెండు సీజన్లు వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో సీజన్ వచ్చింది. ఈ గురువారం(జూన్ 19) అర్థరాత్రి నుంచి ఇది జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ, వెన్నెల కిశోర్, రోహిణి, గుండు సుదర్శన్, అవినాష్, అభయ్ వంటివారు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌ని దర్శకుడు మహి వీ రాఘవ్, ప్రదీప్ అద్వైతం సృష్టించగా, శ్రీరామ్ ఎరగం దర్శకత్వం వహించారు. మరి ఈ రోజు రాత్రి నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్‌ని సెలబ్రిటీలకు, మీడియాకి ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇందులో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కోటి అరగంట నిడివితో ఉంది. మరి సిరీస్ ఎలా ఉంది? గత రెండు సీజన్ల కంటే బెటర్‌గా నవ్వించిందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. సేవ్ ది టైగర్స్ సిరీస్ కథ సింపుల్.. ముగ్గురు జంటల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గంటా రవి(ప్రియదర్శి)పాల వ్యాపారం చేస్తాడు. ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. కానీ అది బెడిసి కొడుతుంది. భార్య హైమావతి(జోర్దార్ సుజాత) కోరిక మేరకు గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతాడు. అక్కడ తంటాలు పడుతుంటాడు. రాహుల్(అభినవ్ గోమటం) రైటర్ కావాలనుకుంటాడు, కానీ అది తేడా కొడుతుంది. దీంతో భార్య మాధురి(పావణి గంగిరెడ్డి)తో గొడవలు జరుగుతుంటాయి. అత్తారింట్లో కూడా రెస్పెక్ట్ లేదు. ఇక విక్రమ్(చైతన్య కృష్ణ) రొమాంటిక్ బాయ్. ఆయన క్రియేటివ్ యాడ్, రైటర్. ఆయన భార్య రేఖ(దేవియాని శర్మ) విడాకులు ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మూడో సీజన్‌లో గంటా రవి, విక్రమ్, రాహుల్ కలిసి ముగ్గురిని కిడ్నాప్ చేస్తారు. తన పాత ఇంటికి తీసుకెళ్తాడు గంటా రవి. అక్కడ వీరు