సేవ్ ది టైగర్స్ 3' ప్రీమియర్స్ లో స్టార్స్ సందడి.. టాక్ ఎలా ఉందంటే
Actor ProfilePolitician

సేవ్ ది టైగర్స్ 3' ప్రీమియర్స్ లో స్టార్స్ సందడి.. టాక్ ఎలా ఉందంటే

Total News1
Movie Updates0
Sources1
సేవ్ ది టైగర్స్ 3' ప్రీమియర్స్ లో స్టార్స్ సందడి.. టాక్ ఎలా ఉందంటే
TV9 Telugu16 Jun 2026
సేవ్ ది టైగర్స్ 3' ప్రీమియర్స్ లో స్టార్స్ సందడి.. టాక్ ఎలా ఉందంటే

సోమవారం సాయంత్రం హైదరాబాద్ AMB సినిమాస్‌లో జరిగిన “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు ఈ వేడుక‌కు హాజ‌రు కాగా.. వారి న‌వ్వుల‌తో, సంద‌డితో సాయంత్రం ఆహ్లాదంగా మారింది. అతిథులు, సెలబ్రిటీలు, నటీనటులు, సాంకేతిక బృందం మరియు క్రియేటర్లు.. ఇలా అంద‌రూ క‌లిసి ప్రాంతీయ OTT వినోదంలో పెద్ద హిట్‌గా నిలిచిన సేవ్ ది టైగ‌ర్స్ ఫ్రాంచైజీలో భాగంగా వ‌చ్చిన సీజ‌న్‌3ను ఎంజాయ్ చేశారు. తారల తళుకులతో మెరిసిన ఈ రెడ్ కార్పెట్ వేడుకకు టీవీ సీరియల్స్ నుంచి సినిమాల వరకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్లు, హై-ఫ్యాషన్‌లో సెలబ్రిటీల మెరిసే హాజరు, ఎక్స్‌క్లూజివ్ మీడియా ఇంటరాక్షన్లు, అలాగే ప్రీ స్క్రీనింగ్ గెట్-టుగెదర్స్.. ఇలా అన్నీ క‌లిసి ఈ స్ట్రీమింగ్ ప్రారంభానికి అద్భుతమైన వేదికగా నిలిచాయి. సేవ్ ది టైగ‌ర్స్ 3 స్పెష‌ల్ సెల‌బ్రిటీ ప్రీమియ‌ర్ వేడుక‌లో టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, కామాక్షి భాస్కర్ల, రాగ్ మయూర్, బిగ్ బాస్ తెలుగు 5 విజేత వీజే సన్నీ, కళ్యాణ్ పడాలా (బిగ్ బాస్ సీజన్ 9 విజేత), చైతన్య రావు, వెంకటేష్ కాకుమాను, కార్తిక్ రత్నం, ఆదిత్య మండల, శ్రీనాథ్ మాగంటి, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్, నిరుపమ్, కిరీటి దామరాజు, మాన‌స్ స‌హా పలువురు ప్రముఖులు పాల్గొని ప్రీమియ‌ర్‌ను ఎంజాయ్ చేశారు. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య, దేవియాని శర్మ, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి వంటి నటీనటుల పెర్ఫామెన్స్‌ల‌కు ప్రేక్షకుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మూడు జంటల కథతో పాటు ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లో వెన్నెల కిషోర్ న‌టించిన ఈ సిరీస్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్‌3కి కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంది. ఇది వ‌ర‌కు మేకర్స్ చెప్పినట్లుగానే, “రెండు ప్రపంచాలు ఢీకొట్టేలా చేసిన గర్జన!

స వ ద ట గర స 3 ప ర మ యర స ల స ట ర స స దడ ట క ఎల ఉ ద ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in