స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్
Actor ProfilePolitician

స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్

Total News1
Movie Updates0
Sources1
స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్ , ఉప్పుతో స్వాగతం
Sakshi17 Jun 2026
స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్ , ఉప్పుతో స్వాగతం

జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా యూరప్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ సోమవారం(జూన్‌ 15, 2026) స్లోవేకియాలో దేశ రాజధాని బ్రటిస్లావాలో ఆ దేశ ప్రధాని రాబర్ట్‌ ఫీకోతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అదీగాక 1993లో ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి స్లోవేకియాను సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. విమానం దిగగానే మోదీకి స్లోవేకియా విదేశీ యూరోపియన్‌ వ్యవహారాల మంత్రి జురాజ్‌ బ్లానార్‌ సాంప్రదాయ స్లోవేకియా ఆహార పద్ధతిలో స్వాగతం పలికారు. అసలేంటి స్వాగతం? దాని అర్థం గురించి సవివరంగా తెలుసుకుందామా..!. స్లోవేకియా స్లావిక్‌ సంస్కృతి ప్రకారం.. గౌరవనీయ అతిథికి తాజాగా కాల్చిన రొట్టెముక్క, ఒకచిన్న పళ్లెంలో ఉప్పుతో స్వాగతం పలుకుతారు. అక్కడ రొట్టే శ్రేయస్సుని, జీవనోపాధిని, భూమి ఆశీర్వాదాలను సూచిస్తుందట. ఇక ఉప్పు శాశ్వత స్నేహం, రక్షణకు చిహ్నంగా పేర్కొంటారు. ఈ స్వాగత కార్యక్రమంలో రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శన కూడా ఉంటుంది. దీంతోపాటు జావా ప్రాంతానికి చెందిన 'కోపానిసియారిక్' అనే బాలల జానపద బృందం జానపద నృత్యంతో మెదీకి ఘన స్వాగతం పలికారు. స్లోవేకియాలానే ఆహారంతో పలికే కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఖర్జూరం, అరబిక్ కాఫీ మధ్యప్రాచ్యంలోని అనేక దేశాలలో, అతిథులకు సాంప్రదాయకంగా ఖర్జూరాలు, అరబిక్ కాఫీ (గహ్వా)తో స్వాగతం పలుకుతారు. చరిత్రకారుల ప్రకారం, ఖర్జూరాలు ఉదారతకు, సమృద్ధికి చిహ్నంగా ఉండగా, తేలికపాటి మసాలాలతో కూడిన కాఫీని ఆతిథ్యానికి, గౌరవానికి చిహ్నంగా పేర్కొంటారు. పోయితో అలోహా స్వాగతం చరిత్రకారుల ప్రకారం, సాంప్రదాయ హవాయి సంస్కృతిలో, సందర్శకులకు స్వాగతం పలకడంలో ఆహారం తరచుగా ఒక పాత్ర పోషిస్తుంది. అక్కడ తిథ్యంతో ముడిపడి ఉన్న ఒక ప్రసిద్ధ ఆహారం పోయి. ఇది టారో దుంపతో తయారు చేసే వంటకం. సామూహిక సమావేశాలలో పోయిని పంచుకోవడం స్నేహం, ఐక్యతకు ప్రతీకగా చెబుతుంటారు. అంతేకాకుండా సందర్శకులకు ఆహారం అందించడం అనేది ఒక కుటుంబం ఉదారతను, అతిథుల పట్ల