
‘కరుప్పు’ సక్సెస్ సూర్యకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో తెలియంది కాదు. అయితే, ఈ సినిమా అనుకున్న టైమ్‌కి రిలీజ్ కాకపోవడానికి, అన్నీ సెట్ చేసుకుని రేపు రిలీజ్ అనగా ఆలస్యంగా విడుదలవడానికి పెద్ద కథే నడిచినట్లుగా తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), ఆర్జే బాలాజీ (RJ Balaji) కాంబినేషన్లో వచ్చిన ‘కరుప్పు’ (Karuppu) సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుని రూ. 300 కోట్ల కలెక్షన్స్‌ను బీట్ చేసింది. ఈ సినిమాకు ముందు సూర్య వరుస పరాజయాల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ‘కరుప్పు’ సక్సెస్‌ని సూర్య గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమాకు మెయిన్ సాంకేతిక నిపుణులైన వారందరికీ సూర్య కారు గిఫ్ట్‌గా ఇచ్చారంటే.. ఈ సక్సెస్ సూర్యకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అంతా బాగానే ఉంది కానీ, ఈ సినిమా అనుకున్న టైమ్‌కి రిలీజ్ కాకపోవడానికి, అన్నీ సెట్ చేసుకుని రేపు రిలీజ్ అనగా ఆలస్యంగా విడుదలవడానికి కారణం ఏంటో అందరికీ తెలుసు. కానీ, అన్ని రిలీజ్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసిన తర్వాత.. సినిమా థియేటర్లలోకి రావడానికి కూడా చాలా మంది సహకారం ఉందని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం వెల్లడించడంతో.. ‘కరుప్పు’ విడుదల వెనుక ఇంత ఫైనాన్షియల్ వార్ జరిగిందా? అని అంతా ఆశ్చర్యపోతారు. రిలీజ్ రోజు కూడా ఈ సినిమా చాలా ఆలస్యంగా విడుదలైంది. అప్పటికప్పుడు కొందరు ఫైనాన్షియర్స్ సపోర్ట్ చేయడం వల్లే.. ఈ సినిమా సాఫీగా విడుదలైందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ సినిమా విడుదలకు సహకరించిన వారందరి గురించి ఆయన చెప్పుకొచ్చారు. సినిమా ఆగిపోతుందని తెలిసి.. అందరికంటే ముందు సూర్య రియాక్ట్ అయ్యారని.. కానీ అక్కడున్న ఇబ్బందులు తను చేయగలిగిన దానికంటే ఎక్కువ ఉండటంతో.. ఆయన చేయగలిగింది చేశారని తెలిపారు. నిర్మాత ఎస్ఆర్ ప్రభు, ఇతర యూనిట్ అంతా సినిమా విడుదల ఆగిపోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, ఆ సమయంలో