
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Aswin) కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడి ( Kalki 2898 AD)బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాల కలయిక ఈ చిత్ర విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడి ( Kalki 2898 AD)బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాల కలయిక ఈ చిత్ర విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్ర సీక్వెల్ కల్కి 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే రెండు కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కాస్టింగ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె తప్పుకున్న విషయం కూడా అందరికి తెల్సిందే. ఇక కల్కి 2 కోసం నాగ్ అశ్విన్ మరో హీరోయిన్ ని వెతుకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భట్ ఈ సినిమాలో ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రలో కనిపించబోతుందని, ఇప్పటికే ఆమె కొంతమేర షూటింగ్‌ను కూడా రహస్యంగా పూర్తి చేసిందని టాక్ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆలియా భట్ ఆ తరువాత తెలుగు సినిమాలో నటించలేదు. కల్కి 2 లో నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన క్యారెక్టర్ విపరీతంగా నచ్చడంతో వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ముంబై వర్గాల టాక్. మరోవైపు, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి పేరు కూడా ఈ సీక్వెల్ కోసం బలంగా వినిపించింది. కానీ, అందులో ఎలాంటి నిజం లేదని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఒక