
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను అలరించిన హాస్య నటుడు వేణు మాధవ్. మిమిక్రీ ఆర్టిస్టుగా, యాంకర్ గా సినీ ప్రయాణం స్టార్ట్ చేసి.. ఆ తర్వాత నటుడిగా సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకున్నారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సంప్రదాయం అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ, మాస్టర్ వంటి చిత్రాలు ఆయనకు బ్రేక్ ఇచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో 500 సినిమాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2019లో వేణు మాధవ్ కన్నుమూశారు. కేవలం 49 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఇప్పటికీ వేణు మాధవ్ నటించిన సీన్స్ యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాయి. ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ వేణు మాధవ్ గొప్ప మనసు గురించి చెప్పకొచ్చారు. ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది.. తెలుగు సినిమా పరిశ్రమలో హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసుకున్న వేణుమాధవ్, కేవలం తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ గొప్ప మానవత్వం చూపారు. ఉత్తేజ్ మాట్లాడుతూ.. ఒక షూటింగ్ జరుగుతున్న సమయంలో, ఆకలితో, కష్టాలతో బాధపడుతున్న ఒక నటుడు వేణుమాధవ్‌ను కలిశారని.. సినిమాలు లేక, సంసారం గడవడం కష్టంగా ఉందని, సహాయం చేయమని ప్రాధేయపడ్డారని గుర్తు చేసుకున్నారు. వేణుమాధవ్ వెంటనే స్పందించి, “చూద్దాం” అని హామీ ఇచ్చారని అన్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత నటుడు ఉత్తేజ్ ను పిలిచి, తన ఇన్నోవా కారు వెనుక భాగాన్ని చూపించారు. అక్కడ రెండు బస్తాల బియ్యం, 10 కిలోల కందిపప్పు, 10 కిలోల పెసరపప్పుతో పాటు అల్లం వెల్లుల్లి నుండి ఉప్పు వరకు రెండు నెలలకు సరిపడా కిరాణా