సాయికృష్ణ కేసులో సంచలనం.. రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు
Actor ProfilePolitician

సాయికృష్ణ కేసులో సంచలనం.. రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సాయికృష్ణ కేసులో సంచలనం.. రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు
10TV Telugu13 Jul 2026
సాయికృష్ణ కేసులో సంచలనం.. రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు

Sai Krishna Missing Case : ఏపీ రాజకీయాల్లో కాకరేపిన సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్‌కు గురైన సీఐ నాగరాజును సిట్ బృందం బుధవారం విజయవాడ 2వ ఏజేఎం కోర్టులో హాజరుపర్చింది. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సిట్ పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రధానంగా సాయికృష్ణ మిస్సింగ్ ఘటనకు సంబంధించి పరిణామాలపై దర్యాప్తులో లభించిన ప్రాథమిక ఆధారాలను కోర్టు దృష్టికి సిట్ బృందం తీసుకెళ్లింది. రిమాండ్ రిపోర్టు ప్రకారం.. సాయికృష్ణ పై గతంలో జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మే1 నుంచి జూన్ 1వ తేదీ వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సీసీటీవీ పుటేజీ లభించలేదు. అయితే, మే6 నుంచి మే8 మధ్య కాలంలో ప్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్ స్టేషన్‌కు పార్శిల్ ఇవ్వడానికి వెళ్లిన సమయంలో సాయికృష్ణను గుర్తించినట్లు పేర్కొన్నారు. మే6న టాస్క్‌పోర్స్ పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకొని కృష్ణలంక సీఐ నాగరాజుకు అప్పగించారు. అయితే, అదుపులోకి తీసుకున్న అనంతరం సాయికృష్ణను న్యాయస్థానంలో ఎందుకు హాజరుపర్చలేదనే ప్రశ్నకు సీఐ నాగరాజు సరైన వివరణ ఇవ్వలేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీటీవీ పుటేజ్ ఎందుకు తొలగించబడిందన్న అంశంపైనా స్పష్టమైన సమాధానం లభించలేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సాయికృష్ణ తల్లి చేసిన ఆరోపణల నేపథ్యంలో మృతదేహాన్ని దహనం చేశారా అనే ప్రశ్నలకూ సమాధానాలు రాలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇతర వ్యక్తుల పాత్ర, ఆరోపణల నిజానిజాలపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ఈ కేసులో ఎస్ఐ ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. సాయికృష్ణ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లో చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో సిట్ ప్రస్తావించింది. మరోవైపు.. సాయికృష్ణది లాకప్‌డెత్ అనే విషయం ప్రాథమిక విచారణలో తేలిందని సిట్ అధికారులు

స య క ష ణ క స ల స చలన ర మ డ ర ప ర ట ల బయటపడ డ ష క గ వ షయ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in