సామాన్యుల కోసం అద్భుతమైన కేంద్ర పథకం.. నెల నెలా రూ.5000 పెన్షన్ రూ.8.50 లక్షలు ఇస్తారు.. ఎలా చేరాలంటే
Actor ProfileCelebrity

సామాన్యుల కోసం అద్భుతమైన కేంద్ర పథకం.. నెల నెలా రూ.5000 పెన్షన్ రూ.8.50 లక్షలు ఇస్తారు.. ఎలా చేరాలంటే

Total News1
Movie Updates0
Sources1
సామాన్యుల కోసం అద్భుతమైన కేంద్ర పథకం.. నెల నెలా రూ.5000 పెన్షన్ రూ.8.50 లక్షలు ఇస్తారు.. ఎలా చేరాలంటే
Samayam Telugu17 Jun 2026
సామాన్యుల కోసం అద్భుతమైన కేంద్ర పథకం.. నెల నెలా రూ.5000 పెన్షన్ రూ.8.50 లక్షలు ఇస్తారు.. ఎలా చేరాలంటే

కేంద్ర ప్రభుత్వం అందిచే సామాజిక భద్రతా పథకాల్లో ఈ అటల్ పెన్షన్ యోజన సైతం ఒకటి 2015 బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) దీనిని నిర్వహిస్తుంది. తక్కువ ఆదాయ అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్ కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో చేరిన వారు 60 ఏళ్ల తర్వాత నిర్ణీత మొత్తంలో పెన్షన్ పొందుతారు. రూ.1000 నుంచి రూ.5000 వరకు లభిస్తుంది. పెన్షన్ సమయంలో భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇస్తారు. ఆమె కూడా మరణిస్తే ఆ కార్పస్ వారసులకు ఇస్తారు. అటల్ పెన్షన్ యోజనలో చేరేందుకు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. పోస్టాఫీసు లేదా ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్, ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారు ఇందులో చేరేందుకు ఉండదు. భారతీయ పౌరులు ఎవరైనా అర్హతలు కలిగి ఉంటే ఈ పథకంలో చేరి ప్రీమియం చెల్లించవచ్చు. అటల్ పెన్షన్ పథకంలో ఎంత ప్రీమియం కట్టాలి అనేది వారి వయసును బట్టి మారుతుంది. రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ లభిస్తుంది. తమకు ఎంత పెన్షన్ రావాలి అనేది నిర్ణయించుకుని దానికి అనుగుణంగా పేమెంట్ చేసుకోవాలి. 18 ఏళ్ల వయసులో చేరినవారు 60 ఏళ్లు వచ్చే వరకు అంటే 42 ఏళ్ల ఈ పథకంలో ప్రీమియం కట్టాలి. 18 ఏళ్లకే ఇందులో చేరే వారు నెలకు రూ.42 నుంచి గరిష్ఠంగా రూ.210 వరకు కట్టవచ్చు. రూ.210 కడితే రూ.5000 పెన్షన్ లభిస్తుంది. అదే 40 ఏళ్ల వయసులో చేరే వారు 20 ఏళ్ల పాటు ప్రీమియం కట్టాలి. వీరు రూ.291 నుంచి రూ.1454 వరకు చెల్లించాల్సి వస్తుంది. అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరిన సభ్యులు వారి చెల్లింపులకు తగినట్లుగా 60