
Rules Change From July 1: జూన్ నెల ముగింపుకు చేరువవుతోంది, అతి త్వరలో జూలై మాసం ప్రారంభమవుతుంది. కొత్త నెలతో పాటు కొత్త ఖర్చులు, బాధ్యతలు కూడా పెరుగుతాయి. జూలై 1వ తేదీ నుంచి సామాన్యులపై భారం పడే అవకాశం ఉంది. ఉద్యోగులు, రిటైర్డ్ వ్యక్తులు, పన్ను చెల్లింపుదారులు, బ్యాంక్ కస్టమర్లు ఈ మార్పుల గురించి తప్పక తెలుసుకోవాలి.. లేదంటే ఇది వారి రోజువారీ ఖర్చులపై ప్రభావం చూపుతుంది. జూలై నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2026 జూలై ఒకటవ తేదీ నుంచి మీ ఆధార్ కార్డుపై ఈమెయిల్ ఐడిని అప్‌డేట్ చేసుకోవడం మరింత సులభతరం చేశారు. UIDAI కేవలం రూ.75 ఫీజుతో మొబైల్ ఆధార్ యాప్ ద్వారా ఈమెయిల్ ఐడిని మార్చుకునే వెసులుబాటు కల్పించింది. జూలై 1 నుంచి 31వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుంది. మీ ఆధార్ కార్డు వివరాలను సిద్ధంగా ఉంచుకుని సులభంగా మార్చుకోవచ్చు. జులై ఒకటవ తేదీ నుంచి రైలు టికెట్ లేకుండా ప్రయాణిస్తే అదనపు భారం పడుతుంది. రైల్వే నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఇకపై టికెట్ లేకుండా ప్రయాణించే వారికి రూ. 250 నుంచి రూ.500 వరకు జరిమానా పడే అవకాశం ఉంది. ఇతరుల టికెట్లతో ప్రయాణించడం నేరంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా, రైల్వే ప్రాంగణాల్లో విక్రయదారులు మరియు అడుక్కునే వారిపై కూడా కొత్త నిబంధనలు ఉండనున్నాయి. మహిళల కోసం కేటాయించిన కోచ్‌లలో పురుషుల ప్రవేశం ఉండదు. ఇటీవల RBI MPC సమావేశం ప్రకారం.. కొన్ని బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించాయి. ఈ జూలై 1వ తేదీ నుంచి ఎఫ్‌డి వడ్డీ రేట్లలో మార్పులు అమల్లోకి రానున్నాయి. బ్యాంకులు నిరంతరం ఈ వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటాయి. జూలై 1వ తేదీ నుంచి బ్యాంకులు కొత్త వడ్డీ రేట్లను అమలులోకి తీసుకురానున్నాయి. జులై ఒకటవ తేదీ నుంచి