స మంత కు త న స త్తా ఏంటో తెలీలేదా
Actor ProfileCelebrity

స మంత కు త న స త్తా ఏంటో తెలీలేదా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స మంత కు త న స త్తా ఏంటో తెలీలేదా
Telugu Times6 Aug 2026
స మంత కు త న స త్తా ఏంటో తెలీలేదా

సమంత(Samantha) ప్రధాన పాత్రలో తెరకెక్కిన మా ఇంటి బంగారం(maa inti bangaram) బాక్సాఫీస్ వద్ద మంచి ర‌న్ తో కొనసాగిస్తోంది. రిలీజైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న ఈ సినిమా రెండో వీకెండ్‌లో కూడా తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ క‌లెక్ష‌న్ల‌ను నమోదు చేస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు పెద్ద ఎత్తున థియేటర్లకు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సమంత యాక్టింగ్, ఎమోష‌న్స్ తో కూడిన కథనం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఫస్ట్ ఛాయిస్‌గా నిలిచింది. మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత తెలుగులో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా ఫలితంపై సమంతకు కొంత సందేహం ఉన్నట్లు ఆమె ప్రమోషన్ల సమయంలో పలుమార్లు వెల్లడించింది. కనీసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే ఆందోళన కూడా తనలో ఉందని చెప్పింది. అయితే ఆ అనుమానాలన్నింటికీ భిన్నంగా మా ఇంటి బంగారం మొద‌టి షో నుంచే మంచి ఆక్యుపెన్సీ నమోదు చేసింది. మొదటి వీకెండ్‌తో పాటు వీక్‌డేస్‌లోనూ స్థిరమైన క‌లెక్ష‌న్లు సాధించి, రెండో వీకెండ్‌లోనూ అదే జోరును కొనసాగిస్తోంది. ఈ స‌క్సెస్ తో సమంత తన మార్కెట్‌ను మరోసారి నిరూపించుకున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మెట‌ర్నిటీ గ్యాప్ త‌ర్వాత ఆమె వరుస తెలుగు సినిమాల‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, సమంత భర్త రాజ్ నిడిమోరు(raj nidimoru) ఇప్పటికే మా ఇంటి బంగారం2(maa inti bangaram2) రూపొందనున్నట్లు ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ స‌క్సెస్ తో సమంత కెరీర్‌లో మరో విజయవంతమైన అధ్యాయం ప్రారంభమైనట్టేనని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి

స మ త క త న స త త ఏ ట త ల ల ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in