సూపర్ స్టార్ రజనీకాంత్ మనవడు హీరోగా ఎంట్రీ
Actor ProfileActor

సూపర్ స్టార్ రజనీకాంత్ మనవడు హీరోగా ఎంట్రీ

Total News1
Movie Updates0
Sources1
సూపర్ స్టార్ రజనీకాంత్ మనవడు హీరోగా ఎంట్రీ
Chitrajyothy16 Jun 2026
సూపర్ స్టార్ రజనీకాంత్ మనవడు హీరోగా ఎంట్రీ

ఇండస్ట్రీలో స్టార్ వారసులు ఎంట్రీ ఇవ్వడం సాధారణమే. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటవారసుడు రంగంలోకి దిగబోతున్నాడు. ఇండస్ట్రీలో స్టార్ వారసులు ఎంట్రీ ఇవ్వడం సాధారణమే. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటవారసుడు రంగంలోకి దిగబోతున్నాడు. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్, హీరో ధనుష్ (Dhanush) ల పెద్ద కుమారుడు యాత్ర రాజా (Yatra Raja) సినీ ఇండస్ట్రీ ఎంట్రీపై సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త హల్‌చల్ చేస్తోంది. ధనుష్- ఐశ్వర్య భార్యభర్తలుగా విడిపోయినా.. తల్లిదండ్రులుగా మాత్రం పిల్లల భాద్యతను కలిసే పంచుకుంటున్నారు. ఇక యాత్రను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ధనుష్ చాలా పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. కొడుకు డెబ్యూ భాద్యతలను వేరేవారి చేతిలో పెట్టకుండా తానే స్వయంగా పరిచయం చేయాలని చూస్తున్నాడట ధనుష్. ధనుష్ కేవలం హీరోగానే కాకుండా డైరెక్టర్ గా కూడా మంచి విజయాలను అందుకున్నాడు. పా పాండి, రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా, ఇడ్లీ కొట్టు వంటి చిత్రాలతో దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్న ధనుష్, ఇప్పుడు కొడుకును గ్రాండ్‌గా లాంచ్ చేసే బాధ్యతను తానే స్వయంగా భుజాన వేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ధనుష్ తన కుమారుడి బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌కు పక్కాగా సరిపోయేలా ఒక అద్భుతమైన యూత్ ఫుల్ కంటెంట్‌తో కూడిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, యాత్రలోని నటనను వంద శాతం బయటకు తీసేలా ఈ కథ ఉండబోతోందని సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్ మనవడిగా, ధనుష్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వస్తున్న యాత్రకు.. తండ్రే స్వయంగా గురువుగా మారి మెగాఫోన్ పడుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ధనుష్ స్వయంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోందని

స పర స ట ర రజన క త మనవడ హ ర గ ఎ ట ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in