సూపర్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్
Actor ProfilePolitician

సూపర్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సూపర్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్
Sakshi6 Sept 2026
సూపర్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్

హీరోయిన్లకు భాషతో సంబంధం లేదు. ఒక భాషకు చెందిన వారు మరొ దానిలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. నయనతార స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తమిళంలో బోలెడంత గుర్తింపు తెచ్చుకుని చెన్నైలోనే సెటిల్ అయిపోయింది కూడా. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో మలయాళీ బ్యూటీ చేరేందుకు రెడీ అయింది. ఆమెనే రియా షిబు. మొదట నటిగా ఆకట్టుకున్న ఈమె.. నిర్మాతగా మారి తమిళంలో విక్రమ్‌‌తో 'వీర ధీర సూరన్‌' సినిమాని నిర్మించింది. తర్వాత కథానాయకగా అవతారమెత్తి 'సర్వం మాయ' అనే మలయాళ చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా పలు రంగాల్లో ప్రతిభ చాటుకుంటున్న రియా.. కోలీవుడ్‌ దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. విక్రమ్‌ హీరోగా చేస్తున్న కొత్త మూవీలో హీరోయిన్‌‌గా అవకాశం వరించింది. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అలా ఉండగానే ఇప్పుడు మరో అవకాశం తలుపు తట్టిందని సమాచారం. విజయ్‌ సేతుపతితో రియా కలిసి నటించడానికి సిద్ధమవుతోందని తెలిసింది. క్రితిక ఉదయనిది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మహిళ దర్శకురాలు ఈసారి కుటుంబ అనుబంధాలతో కూడిన కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తీయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల ప్రారంభమై ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చిత్రీకరణను జరుపుకొంటున్నట్లు, మరో వారంలో తొలి షెడ్యూల్‌ పూర్తికాబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. సీఎం విజయ్ తండ్రి బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు) బుల్లితెర డాక్టర్‌ బాబు సతీమణి ఖరీదైన కారు (ఫొటోలు) మాన్సూన్ జ్ఞాపకాల్లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (ఫొటోలు) బీచ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునయన (ఫొటోలు) పింక్ శారీలో టాలీవుడ్ నటి అనసూయ గ్లామర్ (ఫొటోలు) క్రేజీ కపుల్ ఇద్దరు కలిసి ఏం చేశారో చూడండి ఇలాంటి వాడు MLAనా! మాతో పెట్టుకుంటే.. అడ్వకేట్లు వార్నింగ్ పిచ్ మధ్యలోనే తిట్టుకున్నా SRH ప్లేయర్లు స్టంప్ మైక్ ఆడియో వైరల్ ఏంటి