సినిమా ఫ్లాప్.. తన బాకీ కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అంటూ కేసు వేసిన లేడీ డైరెక్టర్
Actor ProfileActor

సినిమా ఫ్లాప్.. తన బాకీ కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అంటూ కేసు వేసిన లేడీ డైరెక్టర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సినిమా ఫ్లాప్.. తన బాకీ కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అంటూ కేసు వేసిన లేడీ డైరెక్టర్
10TV Telugu22 Aug 2026
సినిమా ఫ్లాప్.. తన బాకీ కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అంటూ కేసు వేసిన లేడీ డైరెక్టర్

Sudha Kongara : లేడీ డైరెక్టర్ సుధా కొంగర తన రెమ్యునరేషన్ బాకీ ఉన్నారంటూ నిర్మాణ సంస్థపై కోర్టులో కేసు వేసింది. గురు, ఆకాశమే హద్దురా.. లాంటి పలు సినిమాలతో మంచి దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది తమిళ మహిళా దర్శకురాలు సుధా కొంగర. సుధా కొంగర ఇటీవల జనవరిలో శివకార్తికేయన్, శ్రీలీల జంటగా పరాశక్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తమిళ్ లో యావరేజ్ గా నిలవగా తెలుగులో డిజాస్టర్ అయింది. అయితే ఈ సినిమాకు 15 కోట్ల రెమ్యునరేషన్ మాట్లాడుకుందట సుధా కొంగర. GST కూడా నిర్మాతలనే అడిగిందట. అది కూడా కలిపి దాదాపు 17 కోట్లకు పైగా డాన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది సుధా. అయితే ఈ పరాశక్తి సినిమాకు గాను నిర్మాణ సంస్థ 9.31 కోట్లు సుధా కొంగరకు చెల్లించింది. మిగతా 8.39 కోట్లు బ్యాలెన్స్ ఉంచింది. దీంతో సుధా కొంగర తన బాకీ రెమ్యునరేషన్ మొత్తం ఇచ్చేవరకు పరాశక్తి సినిమా టీవీలో టెలికాస్ట్ చేయొద్దని, ఆ సంస్థ నుంచి వస్తున్న నెక్స్ట్ సినిమా ఇదయమ్ మురళి ని కూడా థియేటర్స్ లో రిలీజ్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టులో కేసు వేసి నిర్మాణ సంస్థకు నోటీసులు పంపించింది. సుధా కొంగర ఇలా కోర్టు నోటీసులు పంపిస్తుందని ఊహించని నిర్మాణ సంస్థ షాక్ అయింది. జూలై 10న విడుదల కానున్న ఇదయమ్ మురళి సినిమాను నిలిపివేయాలన్న సుధా కొంగర విజ్ఞప్తిపై జూలై 7లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని డాన్ పిక్చర్స్ సంస్థకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు ప్రస్తుతం తమిళనాట చర్చగా మారింది. ఒక దర్శకురాలు అయి ఉండి సినిమా నిర్మాణ కష్టాలు తెలిసి వేరే సినిమా ఆపాలని, ఇంకొక దర్శకుడి కలని ఆపేయడానికి కేసు వేయడంతో సుధా కొంగరపై విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై నిర్మాణ

స న మ ఫ ల ప తన బ క క ట ల ర మ య నర షన ఇవ వ ల స ద అ ట క స వ స న ల డ డ ర క టర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in