
Samantha Love Stories: సమంత ప్రస్తుతం తన తాజా చిత్రం మా ఇంటి బంగారం విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా ఆకట్టుకునే కలెక్షన్లు సాధిస్తోంది. మరోవైపు సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో తరచుగా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమంత కెరీర్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. సమంతతో దర్శకురాలు నందిని రెడ్డికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పటివరకు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత మూడు సినిమాలు చేసింది. అవి జబర్దస్త్, ఓ బేబీ, మా ఇంటి బంగారం. ఈ మూడు చిత్రాలు కేవలం విజయాల పరంగానే కాదు, సమంత వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన దశలతో కూడా అనుబంధం కలిగి ఉండటం విశేషం. మొదటగా జబర్దస్త్ సినిమా విషయానికి వస్తే, ఆ సమయంలో సమంత మరియు నటుడు సిద్ధార్థ్ మధ్య ప్రేమ వ్యవహారం గురించి వార్తలు బాగా వినిపించేవి. వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారనే ప్రచారం ఉన్న సమయంలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకే ఈ చిత్రం సమంత జీవితంలో ఒక ప్రత్యేక దశను గుర్తు చేస్తుందని అభిమానులు భావిస్తుంటారు. ఆ తర్వాత వచ్చిన ఓ బేబీ చిత్రం కూడా సమంత కెరీర్‌లో ఎంతో ముఖ్యమైనది. ఈ సినిమా విడుదలైన సమయంలో సమంత, నాగచైతన్య వివాహ బంధంలో ఉన్నారు. పెళ్లి తర్వాత సమంత నటిగా మరింత గుర్తింపు తెచ్చుకున్న చిత్రాల్లో ఓ బేబీ ఒకటి. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు సమంత నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. ఇక తాజాగా వచ్చిన మా ఇంటి బంగారం చిత్రం కూడా మరోసారి చర్చకు కారణమైంది. ఈ మధ్యనే సమంత.. దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది. పెళ్లయిన వెంటనే భర్త సమర్పణలో సమంత నటించడంతో అభిమానుల